Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఆ అనుభవం లేదు.. కానీ విన్నాను.. కళ్లముందు జరిగితే?: కాజోల్

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన మీటూపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. పనిలో పనిగా క్యాస్టింగ్ కౌచ్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం మొదలెట్టింది. ఆపై చాలామం

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (16:29 IST)
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన మీటూపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. పనిలో పనిగా క్యాస్టింగ్ కౌచ్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం మొదలెట్టింది. ఆపై చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టారు. ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్, ఒకప్పటి బాలయ్య హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. 
 
బాలీవుడ్ దర్శకుడు నానా పటేకర్ తనను వేధింపులకు గురిచేశాడంటూ తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో తను శ్రీ దత్తాకు బాలీవుడ్ అగ్ర హీరోయిన్ల మద్దతు లభించింది.
 
తాజాగా తనుశ్రీ దత్తా-నానా పటేకర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ స్పందించింది. తానెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదని కాజోల్ స్పష్టం చేసింది. కానీ వీటి గురించి తాను విన్నానని వెల్లడించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులెవరూ తామే చేశామని మీడియా ముందుకు రారంటూ తెలిపింది. అయితే సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల మాట నిజమేనని కాజోల్ వెల్లడించింది.
 
తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది. విదేశాల్లో వచ్చిన మీ టూ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది. మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా ఉన్నాయని కాజోల్ అభిప్రాయపడింది. ఈ వేధింపులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదనీ, అన్నిచోట్లా జరుగుతున్నాయని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం