Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్స్ డే రోజున తన కుమారుడు ఫోటోలను షేర్ చేసిన కాజల్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (14:33 IST)
ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమారుడు ఫోటోను తొలిసారి తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోల కింద ఓ కామెంట్ చేశారు. "నువ్వు నాకు ఎంతో విలువైనవాడివో.. ఎంత ప్రత్యేకమో నీకు చెప్పాలనుకుంటున్నా" అంటూ కామెంట్స్ చేశారు. 
 
"నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం.. నీ చిట్టి చిట్టి చేతులను నా చేత్తో పట్టుకున్న ఆ క్షణం.. నీ వెచ్చని శ్వాస నాకు తగిలింది. అప్పుడే నీ అందమైన కళ్లను చూశా. నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు. 
 
నువ్వు నా మొదటి బిడ్డవు. నా మొదటి కొడుకువు. నా మొదటి సర్వస్వం నువ్వు. రాబోయే రోజుల్లో నీకు ఎన్నో విషయాలను నేర్పుతాను. కానీ, అంతకన్నా ముందు నువ్వే నాకు ఎన్నో విషయాలు నేర్పించావు. తల్లి అంటే ఏంటో చెప్పావు. నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్పావు. స్వచ్ఛమైన ప్రేమను అందించావు. 
 
శరీరంలోపలే కాకుండా బయట కూడా హృదయం ఉంటుందన్న విషయాన్ని నిరూపించావు. బయట గుండె ఉండడం భయపడే విషయమేమో కానీ.. అంతకన్నా అందమైన విషయం. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నా తొలి అయినందుకు కృతజ్ఞతలు. మరెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. అందుకు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు నా చిన్ని యువరాజా. 
 
నువ్వు మరింత దృఢంగా ఎదగాలి. ఎదుటి వారిపట్ల దయగా ఉండాలి. ప్రపంచానికి ఎప్పుడూ వెలుతురునివ్వాలి. ధైర్యవంతుడవు కావాలి. దయామయుడిలా, దాతలా, సహనశీలిలా ఉండాలి. గుణవంతుడివి అవ్వాలి. నేను ఇప్పటికే ఈ గుణాలన్నింటినీ నీలో చూస్తున్నాను.
 
నువ్వు నా కొడుకువి అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నా. నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా నక్షత్రాలు.. ఎప్పుడూ ఈ విషయాలు మరచిపోకు" అంటూ కాజల్ అగర్వాల్ భావోద్వేగభరితంగా రాసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments