Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌తో పోటీపడుతున్న కాజల్ అగర్వాల్... ఎందులో తెలుసా?

కాజల్ అగర్వాల్... టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరు. గత కొంతకాలంగా అవకాశాలు లేవు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్‌' ఫెయిల్యూర్‌తో ఆమె పని అయిపోయిందనీ ప్రతి ఒక్కరూ భావించారు. 'జనతా గ్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (13:58 IST)
కాజల్ అగర్వాల్... టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరు. గత కొంతకాలంగా అవకాశాలు లేవు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్‌' ఫెయిల్యూర్‌తో ఆమె పని అయిపోయిందనీ ప్రతి ఒక్కరూ భావించారు. 'జనతా గ్యారేజ్' ఐటమ్ సాంగ్ చేస్తుంటే.. అవకాశాల్లేకే ఐటమ్ భామగా మారిందని చెప్పుకొన్నారు. కానీ, పక్కా లోకల్ అందాలతో జనతా గ్యారేజ్‌ని ఊపేసింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'లోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రానా చిత్రం 'నేనే రాజు, నేనే మంత్రి'లోనూ కాజల్ హీరోయిన్. 
 
అయితే, ఈ భామ కోసం నెటిజన్లు తెగ శోధిస్తున్నారట. ఈ యేడాది ఎక్కువ మంది వెతికిన లిస్టులో ముద్దుగుమ్మ కాజల్ మూడో స్థానంలో నిలిచింది. 2016లో గూగుల్‌‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన హీరోయిన్స్ లిస్టులో శృంగార తారా సన్నీ లియోన్ మొదటి స్థానంలో నిలువగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక, మూడో స్థానంలో టాలీవుడ్ చందమామ నిలవడం విశేషం. 
 
బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తాచాటుతున్న దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలని వెనక్కి నెట్టి కాజల్ మూడో స్థానం దక్కించుకోవడం ఆమె క్రేజ్‌కి అద్దం పడుతోంది. మొత్తానికి.. కాజల్‌లో ఏమాత్రం జోష్ తగ్గలేదన్న విషయం స్పష్టమైంది. గుగూల్‌లో తనకోసం వెతికేవారి సంఖ్య మాములుగాలేదని తెలుసుకొన్న కాజల్ ఫుల్ ఖుషి అయిపోతుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments