కాజల్‌ను కౌగిలిలో నలిపేసిన బ్రహ్మీ... 'ఎం.ఎల్‌.ఏ.'లో సెట్స్‌లో సందడి

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి నలిపేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను కాజల్ తన ఇన్‌‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (11:11 IST)
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి నలిపేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను కాజల్ తన ఇన్‌‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తోన్న 'ఎం.ఎల్‌.ఏ.' (మంచి లక్షణాలున్న అబ్బాయ్‌) సినిమా సెట్స్‌పై ఆదివారం అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. తెలుగులో ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'లక్ష్మీ కల్యాణం'. ఇందులో హీరో కల్యాణ్‌రామే. పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ఇద్దరూ జోడీ కట్టడం విశేషం. సెట్స్‌పై కాజల్‌, బ్రహ్మానందంతో కలిసి కల్యాణ్‌రామ్‌ తీసిన సెల్ఫీని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.
 
"నా తొలి చిత్ర సహ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌తో.. కొత్త సినిమా ‘ఎం.ఎల్‌.ఏ.’ సెట్స్‌పై మొదటి రోజు.. గడచిన సంవత్సరాలన్నీ స్మృతిలోకి వస్తున్నాయి" అని పేర్కొంది. ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడు కాగా, ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సి. భరత్‌చౌదరి, ఎం.వి. కిరణ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా, టి.జి. విశ్వప్రసాద్‌ సమర్పిస్తున్నారు. మణిశర్మ స్వరాలు కూరుస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments