Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి లో సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌గా కబీర్ దుహన్ సింగ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:53 IST)
Kabir Duhan Singh poster
తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని 'ఇంద్రాణి' మూవీ రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు స్టీఫెన్. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో భారీ అడ్వెంచర్ విజువల్ వండర్‌గా ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌గా ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు దర్శకనిర్మాతలు.
 
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు కనిపించని అత్యంత శక్తివంతమైన సూపర్ విలన్‌గా కబీర్ దుహన్ సింగ్‌ కనిపించనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇంద్రాణి, ఎలక్ట్రోమ్యాన్ కబీర్ సింగ్ మధ్య షూట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైనింగ్ పూర్తి చేశామని, అవి అద్భుతంగా వచ్చాయని డైరెక్టర్ స్టీఫెన్ అన్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తాయని తెలిపారు. చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఉండేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట డైరెక్టర్ స్టీఫెన్. ఇటీవలే విడుదల చేసిన ఇంద్రాణి టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. 
 
ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించని యునిక్ స్టోరీలైన్‌తో రూపొందనున్న ఈ 'ఇంద్రాణి' బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఈ సందర్భంగా నిర్మాత స్టాన్లీ సుమన్ బాబు పేర్కొన్నారు. మొదటిసారి తమ సినిమాతో 'ఇండియన్ సూపర్ గర్ల్స్'ని మీ ముందుకు తెస్తున్నామని దర్శకనిర్మాతలు చెప్పారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు.
 
బ్యానర్: వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: స్టాన్లీ సుమన్ బాబు P 
డైరెక్టర్ : స్టీఫెన్
ఎడిటర్: చోటా K ప్రసాద్
మ్యూజిక్: సాయి కార్తీక్   
DOP: చరణ్ మాధవనేని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ... ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు విజయవాడ వరద బాధితులకు వరదసాయం పంపిణీ : సీఎం చంద్రబాబు

ప్రధాని మోడీ హిందువు కాదు.. యూపీ నుంచే గొడ్డుమాంసం ఎగుమతి : జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య

ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు : రైల్వే మంత్రి వైష్ణవ్

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

తర్వాతి కథనం
Show comments