తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం నటన, స్టైల్‌లోనే కాదు విభిన్నశైలీ. అందుకే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఇందులో 'కబాలి' స్టైల్‌కు అభిమానులు మంత్ర ముగ్ధులైపోతున్నారు.
టీజర్ విడుదలైనప్పటి నుంచీ యూట్యూబ్‌లో హిట్లపై హిట్లు వచ్చిపడుతూ.. రికార్డులను తిరగరాసేస్తోంది. ఈనెల ఒకటో తేదీన విడుదలైన 'కబాలి' టీజర్‌కు ఇప్పటివరకు యూట్యూబ్‌లో కోటి 71 లక్షల హిట్లు వచ్చిపడ్డాయి. దీంతో అత్యధిక హిట్లు వచ్చిన భారత సినిమా టీజర్గా 'కబాలి' సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో బాలీవుడ్ చిత్రాల టీజర్ రికార్డులన్నీ కనుమరుగైపోయాయి. కాగా, ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుండగా, యువకుడు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.