Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కబాలి'' ఫీవర్.. రజనీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించిన ముత్తూట్!

సినీ చ‌రిత్ర‌లోనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ''కబాలి'' చిత్రానికున్నంత క్రేజ్ ఇప్పటివరకు విడుదలైన ఏ చిత్రానికి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన కబాలి మానియానే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి

Webdunia
శనివారం, 16 జులై 2016 (10:55 IST)
సినీ చ‌రిత్ర‌లోనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ''కబాలి'' చిత్రానికున్నంత క్రేజ్ ఇప్పటివరకు విడుదలైన ఏ చిత్రానికి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన కబాలి మానియానే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించారు. ఇప్పటికే ఓ విమానాన్ని కబాలి పోస్టర్లతో అలంకరించగా, ఎయిర్ టెల్ ఏకంగా ప్రత్యేక సిమ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ చిత్రం కేరళకు చెందిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్ప‌దం కుదుర్చుకుంది. రజనీకాంత్‌ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్నముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచీల ద్వారా సరఫరా చేయడానికి ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందట. 5 గ్రాముల నాణాన్ని, రూ. 350కి, 10 గ్రాముల నాణాన్ని రూ. 700కు, 20 గ్రాముల నాణాన్ని రూ. 1400కు అందిస్తామని ఈ సంస్థ ప్రకటించింది.
 
వీటిని 15 తేదీనుండి బుక్ చేసుకోవచ్చని, చిత్రం విడుదల తరువాత డెలివరీ ఇస్తామని ప్రకటించింది.  సినిమా విడుదల తర్వాతే ఇవి  అందుబాటులోకి వ‌స్తాయ‌ని ముత్తూట్‌ అధికారి కెయూర్‌ షా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments