Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కబాలి టికెట్ రూ. 2000, సుమ్మా అదురుదిల్లే....!

టాలీవుడ్‌ నుంచి కోలివుడ్‌ వరకు ఏ వుడ్‌ను ఇరగదీయాలన్నా అది ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కే సొంతం. తలైవా.. ఒక్క డైలాగ్ చెబితే చాలు థియేటర్‌ మొత్తం చప్పట్లు, ఈలలతో మారుమ్రోగాల్సిందే. రజనీ ఫైట్‌ వచ్చిందంటే చాలు ఇక ప్రేక్షకుల్లో ఎక్కడ లేని కొత్త ఉత్సాహం ఇ

Webdunia
గురువారం, 21 జులై 2016 (16:28 IST)
టాలీవుడ్‌ నుంచి కోలివుడ్‌ వరకు ఏ వుడ్‌ను ఇరగదీయాలన్నా అది ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కే సొంతం. తలైవా.. ఒక్క డైలాగ్ చెబితే చాలు థియేటర్‌ మొత్తం చప్పట్లు, ఈలలతో మారుమ్రోగాల్సిందే. రజనీ ఫైట్‌ వచ్చిందంటే చాలు ఇక ప్రేక్షకుల్లో ఎక్కడ లేని కొత్త ఉత్సాహం ఇక చెప్పనక్కరలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రజని నూతనంగా నటించిన చిత్రం కబాలి. ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమా విడుదలపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అన్న ఆతృతలో ఉన్నారు సినీలోకం. ప్రస్తుతం ఆ తరుణం ఆసన్నమైంది. రేపే కబాలి విడుదల కానుంది.
 
తిరుపతిలోని 75 శాతానికి పైగా సినిమా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి థియేటర్‌లోను సూపర్‌స్టార్‌ బొమ్మపడేందుకు సిద్ధమైంది. అయితే అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి డబ్బులను దోచుకునేందుకు సిద్థమవుతున్నారు సినిమా థియేటర్‌ యాజమాన్యాలు. తిరుపతిలో గ్రూప్‌ థియేటర్స్, రిలయెన్స్ థియేటర్లే పెద్దవి. ఇక్కడే మొత్తం తంతు జరిగేవి. రేపు సినిమా విడుదల అవుతుండడంతో ముందుగానే టికెట్లను విక్రయించేస్తున్నారు. ఒక్కో టికెట్ 2వేల రూపాయలు. ఇప్పటికే నైట్‌ షో నుంచి రెండురోజుల పాటు జరిగే షోల వరకు ప్రతి షోకు టికెట్లను అమ్మేశారు. ఇక సినిమా విడుదల కావడమే ఆలస్యం. 
 
సినిమా ప్రారంభమైనా కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు. ఇచ్చినా 20 నుంచి 30 టికెట్లు మాత్రమే ప్రేక్షకులకు ఇస్తారు. ఎందుకంటే ముందుగానే అమ్మేశారు కాబట్టి. తిరుపతి లాంటి ప్రధాన నగరాల్లో రజనీకాంత్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం కావడంతో రజనీ అభిమానులు ఎక్కువే. ఇప్పటికే థియేటర్ల చుట్టూ పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేసేశారు. రేపు సినిమా విడుదల తరువాత రజని కటౌట్లకు పాలాభిషేకం చేయడానికి కూడా సిద్థమవుతున్నారు అభిమానులు. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి. అభిమానుల్లో రజినీ సినిమా చూడాలన్న ఆతృతలో ఒకవైపు ఉంటే థియేటర్‌ యాజమన్యం మాత్రం అభిమానుల జేబుల చిల్లులు పెట్టేందుకు సిద్థమవుతోంది. మొత్తం మీద తిరుపతిలో కబాలి ఫీవర్‌ అభిమానులకు పట్టుకుంది.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments