Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణ శేఖ‌ర్ యుఫోరియా’కు సంగీత దర్శ‌కుడు కాల భైర‌వ‌ స్పెష‌ల్ వీడియో

డీవీ
సోమవారం, 10 జూన్ 2024 (15:18 IST)
Kaala Bhairava
కాల భైర‌వ‌.. భార‌త‌దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపారు. ఆయ‌న‌ ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.
 
‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని  టీమ్ తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments