Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాదల్'' మూవీ టీజర్ విడుదల

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (21:27 IST)
విశ్వంత్, చిత్ర శుక్ల జంటగా నటించిన సినిమా ''కాదల్''. ఈ చిత్రంతో కళ్యాణ్ జీ గొంగన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టఫ్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడి నిర్మిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా కాదల్ సినిమా టీజర్ ను విడుదల
చేశారు.
 
టీజర్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. 2004లో జరిగిన ప్రేమ కథ అంటూ టీజర్ లో చూపించారు. అందమైన అమ్మాయిని చూడగానే ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్రలో హీరో యశ్వంత్ కనిపించాడు. నావయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా అని హీరోయిన్ చిత్ర శుక్ల అడిగితే, అబ్బే ఏజ్ గురించి ఏముంది ఊరికే మాట్లాడటానికి అంటూ మనసులోని ప్రేమను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్ లో ఉంది. ఆ అమ్మాయి నీకు కూడా అక్కేరా అంటూ తండ్రి కొడుకును కంట్రోల్ లో పెట్టేందుకు చెప్పే డైలాగ్ లు సరదాగా ఉన్నాయి. టీజర్‍‌థీమ్ మ్యూజిక్ ఎంతో ప్లెజంట్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
 
ఆశిష్ గాంధీ, రాకేందు మౌళి, దేవి ప్రసాద్, అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ, అప్పాజీ అంబరీష్, రూపా లక్ష్మి, డీజే దినేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రామ్ మద్దుకూరి ఆర్ట్ - ఆరె వెంకటేశ్వర్లు, సాహిత్యం - రాకేందు మౌళి, పీఆర్వో - జీఎస్కే మీడియా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments