Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కళాతపస్వి' కె. విశ్వ‌నాథ్ బ‌యోపిక్ ప్రారంభం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పి.. తెలుగు సినిమా రంగానికే కాకుండా.. దక్షిణాది చలన చిత్రసీమకే గర్వించదగ్గ దర్శకులుగా నిలిచారు కె.విశ్వనాథ్‌. ఆయ‌న‌ జీవితం వెండితెరపైకి తీసుకువ‌స్తున్నారు. రచయిత, డైరెక్టర్‌ జనార్ధన మహర్షి దర్శకత్వంలో విశ్

Webdunia
శనివారం, 28 జులై 2018 (14:47 IST)
తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పి.. తెలుగు సినిమా రంగానికే కాకుండా.. దక్షిణాది చలన చిత్రసీమకే గర్వించదగ్గ దర్శకులుగా నిలిచారు కె.విశ్వనాథ్‌. ఆయ‌న‌ జీవితం వెండితెరపైకి తీసుకువ‌స్తున్నారు. రచయిత, డైరెక్టర్‌ జనార్ధన మహర్షి దర్శకత్వంలో విశ్వదర్శనం పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ అన్నది ట్యాగ్‌లైన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి.
 
కె. విశ్వనాథ్‌ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు. విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే స‌దుద్దేశ్యంతోనే ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటివరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుందని... ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్ర నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments