Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యంత ధనిక హీరో ఎవరు?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:20 IST)
దేశంలో అత్యంత ధనిక హీరో ఎవరు? ఈ విషయంపై ప్రముఖ సీనియర్ హీరో, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.మురళీమోహన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌లో ఉన్న సమయంలోనే రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగానని చెప్పారు. 
 
ఆ సమయంలోనే తనకు హీరో శోభన్ బాబుగారితో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదన్నారు. దీంతో ఆయనతో అనేక విషయాలపై చర్చించేవాడినని చెప్పారు. అయితే, శోభన్ బాబు చాలా జాగ్రత్తపరుడు అని చెప్పారు. తన చేతికి వచ్చిన ప్రతి రూపాయిని స్థలాలపై పెట్టారని చెప్పారు. అపుడు ఒక ఎకరా రూ.5 వేలకు కొనుగోలు చేస్తే ఇపుడు రూ.50 కోట్ల మేరకు పెరిగిందన్నారు. ఇలా చెన్నై పరిసర ప్రాంతాల్లో శోభన్ బాబుకు అనేక ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల స్థలాలు ఉన్నాయని మురళీ మోహన్ తెలిపారు. ఈ లెక్కన తనకు తెలిసి మన దేశంలో అత్యధిక ధనవంతుడు శోభన్ బాబే అయివుంటారని మురళీ మోహన్ చెప్పారు. 
 
అలాగే, తాను సంపాదించిన సొమ్మునంతా ఎలా పోగొట్టుకున్నారో కూడా ఆయన వివరించారు. తనకు సినిమాలతో పాటు వ్యాపారం అంటే అమితమైన ఇష్టమన్నారు. ఈ కారణంగానే రెండు మూడు సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 
 
తమిళనాడులో ఇద్దరు రాజకీయ ఉద్దండులైన ఎంజీఆర్ - కరుణానిధి కథతో "ఇద్దరు" సినిమా తెరకెక్కిందని చెప్పడంతో ఆ సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేశానని చెప్పారు. అయితే, ఈ చిత్రం తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుందనీ ఈ కారణంగానే రెండో ఆటకే వసూళ్లు పడిపోయారన్నారు. దీంతో తాను సంపాదించినందా 'ఇద్దరు' చిత్రంతో పోయిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఆపై దొంగలు చంపేశారంటూ...

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ - ఏడుగురు దుర్మరణం

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments