Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ఎ మినిట్ అంటోన్న ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి

డీవీ
గురువారం, 18 జులై 2024 (12:36 IST)
Director Sankalp Reddy
ఏడు చేపల కథ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి సమర్పించు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా యశ్వంత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జస్ట్ ఎ మినిట్. ఈ సినిమాకి సంబంధించి సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఘాజి, అంతరిక్షం మూవీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి.
 
ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ : సుధర్మ మూవీ మేకర్స్ లోగో, జస్ట్ మినిట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ ధర్మపురి తో నాకు మంచి అనుబంధం ఉంది. టెక్నికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. జస్ట్ ఎ మినిట్ సినిమాతో ప్రొడక్షన్ వైపు వచ్చారు. అదేవిధంగా అభిషేక్ రెడ్డి గతంలో చేసిన ఏడు చేపల కథ సినిమా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. నాకు తెలిసి ఉన్న ఇద్దరు జస్ట్ ఎ మినిట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి విషయం. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోంది. మంచి కామెడీ ఆరోగ్యానికి మంచిది. ఈ సినిమా కార్తీక్ కి అభిషేక్ రెడ్డికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాతలు తన్వీర్, ప్రకాష్ ధర్మపురి మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉండి కూడా మా కోసం సమయం కేటాయించి  మా సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ లోగో మరియు మా జస్ట్ ఎ మినిట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సంకల్ప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నాం.  ప్రేక్షకులు సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments