Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్ కొత్త రికార్డ్ అదుర్స్.. 2016లో టీవీల్లో అత్యధిక మంది చూసిన సినిమాగా?

2016లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయిన... ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ''జనతా గ్యారేజ్''. అయితే ఇప్పటికీ జనతా గ్యారేజ్ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, గ్యారేజ్ ఖాతాలో మరో

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (16:34 IST)
2016లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయిన... ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ''జనతా గ్యారేజ్''. అయితే ఇప్పటికీ జనతా గ్యారేజ్ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, గ్యారేజ్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చిపడింది. 2016లో ఎక్కువ మంది తిలకించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. టీవీలో అత్యధిక మంది చూసిన చిత్రంగా జనతా గ్యారేజ్ రికార్డ్ సృష్టించిందని టీవీ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజెన్సీ (బీఏఆర్‌సి) ఇండియా ప్రకటించింది.
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతతో పాటు నిత్యామీనన్ కలిసి నటించారు. ఇక మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో అలరించాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. జనతాగ్యారేజ్ రికార్డులు సృష్టిస్తుండటం పట్ల గ్యారేజ్ చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.
 
ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక ఈ సినిమాకు తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం ఎన్టీఆర్ సర్వం సిద్ధం చేసుకున్నాడు. చివరికి బాబీ చెప్పిన కథని ఓకేశాడు. సంక్రాంతి తర్వాత తారక్ - బాబీల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments