Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (09:16 IST)
Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర చేపట్టారు. కుటుంబ సమేతంగా ఉడిపిలో పర్యటించారు. తన తల్లి స్వగ్రామం కర్ణాటకలోని కుదపురకు కుటుంబంతో సహా వెళ్లాడు. అంతేకాకుండా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పూజలు చేశారు. అక్కడ కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌కు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ పర్యటనలో వారిద్దరూ పక్కనే ఉన్నారు. ఆలయంలో రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా దర్శనం చేయించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
 
ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. "మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్‌ ఏనాడు ఇవ్వలేదు" అని ఎన్టీఆర్‌ పోస్టుచేశారు. ఇంకా సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి నుదుటన బొట్టుపెట్టిన వీడియో, ప్రశాంత్ నీల్, రిషబ్‌తో కలిసి భోజనం చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments