Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 6న ''జనతా గ్యారేజ్" ఫస్ట్‌ ట్రైలర్‌... సోషల్ మీడియాలో గ్యారేజ్ స్టిల్స్‌కు వైరల్!

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలలో వెరైటీ హెయిర్ స్టైల్, గెటప్‌లతో అలరించిన ఎన్టీఆర్, తన తాజా చిత్రం జనత గ్యారేజ్‌లో రెండు రకాల షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ''జనతా గ్యారేజ్" ఫస్ట్‌ ట్రె

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (18:03 IST)
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలలో వెరైటీ హెయిర్ స్టైల్, గెటప్‌లతో అలరించిన ఎన్టీఆర్, తన తాజా చిత్రం జనత గ్యారేజ్‌లో రెండు రకాల షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ''జనతా గ్యారేజ్" ఫస్ట్‌ ట్రైలర్‌ను జులై 6న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. 
 
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. స్టైలిష్‌ లుక్‌తో ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో కనిపిస్తే.. మోహన్‌లాల్‌, దేవయాని, సుమన్, అజయ్‌లతో కూడిన సినిమా స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా జనతా గ్యారేజ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
 
యాక్షన్ సినిమాగా తెరకెక్కే జనతా గ్యారేజ్ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకునే ఈ సినిమా ఎన్టీఆర్‌కు టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత మంచి హిట్‌ను ఇస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతుండగా, ఆగస్టు 12న సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments