Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం మెగాస్టార్ నుంచి హీరోలు వస్తారా..? నందమూరి కొత్త హీరో రెడీ..?!

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (16:52 IST)
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త కొత్తగా హీరోలు పుట్టుకొస్తున్నారు. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరో వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
నట సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రాణించారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తారక రత్న హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని తెలుస్తుంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయం అవుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడి పేరు నార్నే నితిన్ చంద్ర. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతికి తమ్ముడు. ప్రస్తుతం ఈ కుర్రాడు నటనలో, డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకుంటున్నదని తెలుస్తుంది. 
 
ఇక ఈ యంగ్ హీరో డెబ్యూ కోసం దర్శకుడిని కూడా వెతుకుంటున్నారట. అయితే బావమరిదిని హీరోని చేసే బాధ్యత తారక్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ కుర్రహీరోను దర్శకుడు తేజ పరిచయం చేయనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments