Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి కోసమే ఉన్నాం.. ఎవరికీ భయపడే స్వభావం కాదు.. జీవిత రాజశేఖర్

ఠాగూర్
సోమవారం, 4 మార్చి 2024 (12:41 IST)
తమ ఇద్దరు పిల్లలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారని, తమ కంటే వాళ్ల ఇద్దరి కెరీర్ ఎంతో ముఖ్యమని, అందుకే గత కొన్ని రోజులుగా తగ్గువగా మాట్లాడుతున్నట్టు సినీ నటి జీవిత రాజశేఖర్ తెలిపారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, తాను, రాజశేఖర్‌లు ఇద్దరూ కొన్ని విషయాల్లో నిర్మొహమాటంగా మాట్లాడుతామని, ఈ కారణంగా తామిద్దరం మేమిద్దరం పలు సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. 
 
"నేను, రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకు అలా నడిచింది. కానీ, ఇపుడు పిల్లలు ఇద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వల్ల మా పిల్లల కెరియర్ దెబ్బతినకూడదు. మా కారణంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను రాజశేఖర్ కలిసి మాట్లాడుకున్నాం"s అని వివరించారు.
 
"నేను, రాజశేఖర్ చాలా కెరియర్ చూశాం. ఇక ఇపుడు పిల్లల వంతు. మేము లేకుండా వాళ్ళు చాలా దూరంగా ప్రయాణించవలసి ఉంటుంది. అందువల్ల వాళ్ల కెరియర్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేు కాస్త తక్కువగా మాట్లాడుతున్నాను. దీనికి కారణం.. మా ఇద్దరు పిల్లల కెరియర్‌ను దృష్టిలో పెట్టుకోవడం వల్లే. అయితే, భయపడటం కాదు.. తమది ఎవరికీ భయపడే స్వభావం కూడా కాదు" అని జీవిత రాజశేఖర్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అమెరికాలో గుడివాడ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments