Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవా - హన్సిక మోత్వాని కాంబినేషన్‌లో 'పోకిరిరాజా'

'రంగం'వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జీవా మరోసారి 'పోకిరి రాజా'తో మన ముందుకు వస్తున్నారు. జీవా హీరోగా గ్లామరస్‌ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (15:29 IST)
'రంగం'వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జీవా మరోసారి 'పోకిరి రాజా'తో మన ముందుకు వస్తున్నారు. జీవా హీరోగా గ్లామరస్‌ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా పి.టి. సెల్వకుమార్‌ సమర్పణలో రామ్‌ప్రకాష్‌ రాయప్ప దర్శకుడుగా టి.ఎస్‌ పొన్‌సెల్వి తమిళంలో నిర్మించిన చిత్రం 'పోకిరిరాజా'. 2016 మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయి జీవా కెరీర్‌లో నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. 
 
కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌విఎస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఉసిరికల హనీ ప్రమోద్‌, పి.శ్రీనివాస్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, ఎం.వి.ఆర్‌. ఫిలింస్‌ అధినేత ఎం. వెంకట్రావు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 'పోకిరిరాజా' చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత ఎం.వెంకట్రావు మాట్లాడుతూ ''తమిళంలో రూపొందిన 'పోకిరిరాజా' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. జీవా పెర్ఫామెన్స్‌, హన్సిక గ్లామర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ హీరో సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ ముఖ్యపాత్రలో నటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు రొమాన్స్‌ కూడా ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది హైలైట్‌గా నిలుస్తుంది. 
 
ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. డి.ఇమామ్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో మంచి హిట్‌ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వండర్‌ఫుల్‌గా చేశాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే గొప్ప సినిమా ఇది'' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments