Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదుగుతుంటే అసూయ లేదా! అంటే అల్లు అర్జున్ ఏమ‌న్నాడో తెలుసా!

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (17:48 IST)
Anangd, Allu arjun, Vijay devarakonda and ohters
`విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉండదా! అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారు. నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి ఇన్స్ పైర్ అవ్వాలి గానీ అసూయ పడొద్దని చెప్పా. అలా విజయ్ ఎదుగుతుంటే అతన్ని చూసి నేనూ స్ఫూర్తిపొందుతా. అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి కూడా` అని అల్లు అర్జున్ అన్నారు.
 
ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం". గీత్ శైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా  వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ల లో రిలీజ్ కు రెడీ అవుతున్న "పుష్పక విమానం" చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా  "పుష్పక విమానం" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రైలర్ ను ఐకాన్ స్టార్అ ల్లు అర్జున్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, పుష్పక విమానం సినిమాతో మీరు హిట్ కొట్టారనే అనుకుంటున్నా. కోవిడ్ టైమ్ లో రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. ఈ చిత్రంలో మేఘనా, గీత్ లాంటి తెలుగు అమ్మాయిలు నటించడం చూసేందుకు బాగుంది. ఆనంద్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించాడు. ట్రైలర్ లో అతన్ని చూస్తుంటే ఆకట్టుకునేలా నటించాడు. విజయ్ తనలో ఎలా స్ట్రెంత్ గుర్తుంచాడో అలాగే నీలో బలమేంటో తెలుసుకుని ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు.
 
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి స్క్రిప్టులు, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ లాంటి ప్రతిభ గల దర్శకులు పక్కనే ఉన్నా నిర్మాతలు ఎవరూ లేక ఆ సినిమాలు చేయలేని పరిస్థితిని చూశాను. ఆ కష్టాలు చూసిన అనుభవంతో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. నా కింగ్ ఆఫ్ హిల్ఎం టర్ టైన్ మెంట్స్ లో రెండో ప్రాజెక్ట్ పుష్పక విమానం. దామోదర నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచీ తెలుసు. ఆయన అప్పుడు రైటర్ గా కథలు రాసేవారు. నాకు ఓ కథ చెప్పారు నచ్చింది, సినిమా చేద్దామనే ఆలోచన ఉండేది. ఆ స్నేహం అలా కంటిన్యూ అయ్యింది. 
ఈ కథలో హీరో క్యారెక్టర్ కు చాలా కష్టాలుంటాయి. అతనికి కష్టాలు గానీ మనకు నవ్వొస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓపిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్బ్ గా నటించారు. బన్నీ అన్న మా
సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులు ఫిదా అయ్యాను. ఆర్య సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పర్మార్మెన్స్, డాన్సులు చూసి అద్భుతంగా చేశాడు అనిపించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి వల్ల మేము మరింత దగ్గరయ్యాం. బన్నీ అన్న, మహేష్ గారు లాంటి స్టార్స్ సినిమా ఫంక్షన్ లో నా గురించి మాట్లాడటం కలా నిజమా అనిపించేది. అన్నా, మీ టాలెంట్, లక్ ఈ టీమ్ కు కూడా ఉండాలి. వీళ్లు మంచి సినిమాలు చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బెస్ట్ స్టేజ్ లో ఉంది.
 
బన్నీ అన్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ చేస్తున్న సినిమాలు తెలుగు సినిమా గ్రేట్ నెస్ చూపిస్తున్నాయి. అల్లు అర్జున్ అన్న వర్క్ చూసి ప్రతి రోజూ ఇన్ స్పైర్ అవుతుంటా. పుష్ప  సినిమాకు మీరు పడిన కష్టం చూస్తుంటే మనం కూడా ఇలా కష్టపడాలి అని అనిపిస్తుంటుంది. మాకు ఎప్పుడూ ఇన్సిపిరేషన్ గా మీరు ఉండటం సంతోషంగా ఉంది. మీరు, సుకు సార్ కలిసి పుష్పలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. బన్నీ అన్నను పుష్పరాజ్ గానే చూస్తున్నా. ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. పుష్పక విమానం నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. థియేటర్ లలో చూసేయండి. 
 
 పునీత్ అన్నను కోల్పోయాం. ఆయనను రెండు మూడు గంటలు మాత్రమే కలిశాను. నిన్నటి నుంచి మనసులో ఆయన ఆలోచనే ఉంటూ వస్తోంది. జీవించి ఉన్నంతకాలం సంతోషంగా ఉందాం, ప్రేమిద్దాం, స్నేహంగా ఉందాం. లవ్ యూ ఆల్. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments