నంది అవార్డ్స్ స్టుపిడ్, నాన్సెన్స్.. పవన్ సినిమాల వల్ల యువత ప్రభావితం కావట్లేదు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే సినిమాల వల్ల యువత ప్రభావితం కావట్లేదని.. ఆయన చేసే సేవల ద్వారానే యువత ఆయనపై అభిమానం పెంచుకుంటున్నారని సినీ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు చ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే సినిమాల వల్ల యువత ప్రభావితం కావట్లేదని.. ఆయన చేసే సేవల ద్వారానే యువత ఆయనపై అభిమానం పెంచుకుంటున్నారని సినీ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు చురుగ్గా వుండే పవన్ కల్యాణ్. ఆయన చేసే సేవల ద్వారానే అభిమాన దేవుళ్లను సంపాదించుకుంటున్నారని జేడీ తెలిపారు.
అందుచేత పవన్ కల్యాణ్ సినిమాల వల్ల యువత ప్రభావితం అవుతున్నారని చెప్పడంలో నిజం లేదని చెప్పారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని జేడీ చెప్పుకొచ్చారు. అలాగే రివ్యూలు కూడా సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపవని, సినిమాలకు విశ్లేషకులు ఇచ్చే రివ్యూలను తాను పట్టించుకోనని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.
అలాగే సోషల్ మీడియాకు ఆమడ దూరంలో వుంటానని.. తనరు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఖాతాలు లేవని ఆయన చెప్పారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కన్నడ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు.
తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చారు. 1989 నుంచి 2017 వరకు వచ్చిన నంది అవార్డులు అన్నీ స్టుపిడ్, నాన్సెస్ అన్నారు. ఎందుకంటే నంది అవార్డు తనకు రాలేదని.. అందుకే నంది అవార్డులను స్టుపిడ్ తెలిపారు. తాను సెల్ఫిష్ అని చెప్పుకొచ్చారు. తనకు నచ్చింది కరెక్టేనని.. తనకు నచ్చనది రాంగ్ అన్నారు. తాను తెలివిగల వాడినని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.