Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' తలవంచి నమస్కరించిన ఏకైక వ్యక్తి చో రామస్వామి.. ఆయనే నటి రమ్యకృష్ణ మేనమామ

చో రామస్వామి. దేశంలో పేరొందిన జర్నలిస్టు. విమర్శకుడు. రచయిత. తుగ్లక్ పత్రిక ఎడిటర్. అంతేకాదు దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, నాటక రచయిత కూడా. ఎపుడు చూసినా నున్నగా గీసిన గుండు, నుదుట విభూది బొట్టు, సఫారీ డ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (14:30 IST)
చో రామస్వామి. దేశంలో పేరొందిన జర్నలిస్టు. విమర్శకుడు. రచయిత. తుగ్లక్ పత్రిక ఎడిటర్. అంతేకాదు దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, నాటక రచయిత కూడా. ఎపుడు చూసినా నున్నగా గీసిన గుండు, నుదుట విభూది బొట్టు, సఫారీ డ్రెస్, పెద్ద కళ్లజోడు... ఇది చో రామస్వామి స్వరూపం. పైగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడు... ఆప్తుడు... రాజకీయ సలహాదారుడు కూడా. అంతేకాదు, ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయానా మేనమామ. 82 ఏళ్ల చో రామస్వామి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే.. మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు మీద 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించారు. 1968లో 'తుగ్లక్' అనే నాటకాన్ని రచించి... దాన్ని కనీసం 2000 సార్లు ప్రదర్శించిన నటుడు. ఇందిరాగాంధీని విమర్శిస్తూ ఈ నాటకాన్ని రచించి ప్రదర్శించిన ధైర్యవంతుడు. ఆయన 57 సినిమాల్లో నటించారు. 37 సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. 
 
జయలలితకు అత్యంత సన్నిహితులు. రాజకీయ సలహాదారు కూడా. ఎవరి మాట వినని జయలలిత... కేవలం చో మాట మాత్రమే వింటారని చెప్పుకుంటుంటారు. ఆలోచనలు స్పష్టంగా ఉండటం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం చో రామస్వామి వ్యక్తిత్వం. ఈ లక్షణాలే ఆయనను జయలలితకు అత్యంత చేరువ చేశాయి. అంతేకాదండోయ్.. ఎవరీ వద్దా తలవంచి నమస్కరించని జయలలిత.. ఒక్క చో రామస్వామి దంపతుల ఎదుట మాత్రం తలవంచి నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సంచలన వార్తగా కొన్ని పత్రికలు ప్రచురించాయి కూడా. 
 
ముఖ్యమంత్రి పదవికి జయలలిత కంటే రామస్వామే బెటర్ అనేది సూపర్ స్టార్ రజినీకాంత్ అభిప్రాయం. రిజర్వేషన్లకు రామస్వామి వ్యతిరేకం. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రామస్వామి మంచి మిత్రుడు. జయకు, మోడీల మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి రామస్వామే ప్రధాన కారణం. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments