Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్ణ తల్లిగా.. జయప్రద కూతురిగా.... ఉత్కంఠత రేపుతున్న 'సువర్ణ సుందరి'

ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించిన నటి జ‌య‌ప్ర‌ద. తెలుగు ఇండస్ట్రీని వీడి బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ నుంచి రాజకీయాల్లోకి వెళ్లింది. ఇపుడు మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేంద

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (13:48 IST)
ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించిన నటి జ‌య‌ప్ర‌ద. తెలుగు ఇండస్ట్రీని వీడి బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ నుంచి రాజకీయాల్లోకి వెళ్లింది. ఇపుడు మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. పూర్ణ, సాక్షి చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న "సువ‌ర్ణ సుందరి" చిత్రంలో కూతురిగా క‌నిపించేందుకు సిద్ధమైంది.
 
సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియ‌డ్ డ్రామా చిత్రంగా రానున్న ఈ సినిమా శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతోంది అనే ట్యాగ్ లైన్‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా మూవీ రూపొందుతుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 
 
ఈ త‌రం క‌థానాయిక పూర్ణ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, ఆమె కూతురి పాత్ర‌లో జ‌య‌ప్ర‌ద న‌టించ‌డం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో సాయికుమార్.. కోట శ్రీనివాసరావు కనిపించనున్నారు. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దామనీ.. సెప్టెంబరులో విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మ‌రి విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జ‌య‌ప్ర‌ద కూతురిగా, పూర్ణ తల్లిగా ఎలా అల‌రిస్తారో చూడాలి.
 
ఇకపోతే, ఈ తరం ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. తాము ఆశిస్తోన్న కొత్తదనం కలిగిన సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు. అందువల్ల కొత్తగా వైవిధ్యంగా అనిపించే కథలనే దర్శక నిర్మాతలు ఎంచుకుంటున్నారు. ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు. అలా దర్శకుడు సూర్య రూపొందించిన 'సువర్ణ సుందరి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్ వర్క్స్‌తో ఆద్యంతం ఉత్కంఠత రేపేలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు దర్శకుడు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments