పుష్ప జోరు తగ్గలేదే.. కరోనాలో కలెక్షన్ల వర్షం.. శ్రీదేవి కుమార్తె కితాబు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (18:37 IST)
దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిన కూడా పుష్ప జోరు తగ్గలేదు. బాలీవుడ్‌లో పుష్పకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. హిందీలో విడుద‌లై 20 రోజులు దాటిన‌ప్ప‌టికీ పుష్పకు హిందీలో పోటీ ఇచ్చే సినిమా ఇంత‌వ‌ర‌కు రాలేదు. దీంతో ఈ సినిమా రూ.80 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.  
 
ఈ సినిమా హిందీలో గ‌త‌ శుక్ర‌వారం రూ.1.95 కోట్లు, శ‌నివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబ‌ట్టింది. కరోనా కాలంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ వీకెండ్‌లో మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలైంది. 
jhanvi kapoor
 
దీంతో, థియేటర్లలో ఈ సినిమాను చూడలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఓటీటీలో చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. 'పుష్ప' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments