Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అప్ కమింగ్ ప్రాజెక్టులో జాన్వీ ఉందనేది కేవలం రూమర్ మాత్రమే... హీరో నాని

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (08:45 IST)
నేచురల్ స్టార్ నాని సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించనుందనే వార్త హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నాని తాజాగా స్పందించారు. 'నా అప్ కమింగ్ ప్రాజెక్టులో జాన్వీ ఉందనేది కేవలం రూమర్ మాత్రమే. బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగులతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోలేకపోతున్నాను' అని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు. ఇదిలావుంటే, నాని హీరోగా నటించిన "సరిపోదా శనివారం" చిత్రం ఈ నెల 29వ తేదీన తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
మరోవైపు, జాన్వీ కపూర్ కూడా తెలుగు చిత్రాల్లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. రెండు చిత్రాలతో తెలగు ప్రేక్షకులను పలుకరించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన "దేవర" చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా వచ్చే ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 27వ తేదీన విడుదలవుతుంది. అలాగే, "ఉప్పెన" ఫేమ్ సాన బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో కూడా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. నానితో చిత్రం ఖరారైతే జాన్వీ నటించే మూడో తెలుగు చిత్రం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments