Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ చిత్రం కోసం రోజూ దేవుడిని ప్రార్థించాను : జాన్వీ కపూర్‌

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (16:30 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాలో నటించాలన్న బలమైన కోరికతో ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించానని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. తాను ఎన్టీఆర్‌ని ఎంతగానో అభిమానిస్తున్నట్టు చెప్పారు. పైగా, ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే కొత్త చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఎన్టీఆర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో పనిచేసే ఛాన్స్‌ వస్తే బాగుండని ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాను. ప్రతిరోజూ దేవుడిని కోరుకునేదాన్ని. ఫైనల్‌గా అది నిజమైంది. సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు దర్శకుడికి రోజూ మెసేజ్‌లు పెడుతున్నా. ఇటీవలే మరోసారి 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూశాను. ఆయన అందం, ఉత్సాహం.. మరోస్థాయిలో ఉంటాయి' అని జాన్వీ తెలిపారు.
 
'సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టినందుకు ఆనందిస్తున్నా. కెరీర్‌ ఆరంభంలోనే నేను ఇంతటి గుర్తింపు పొందుతున్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులే. అయితే, నేను ధరించే దుస్తులను కాకుండా నా వర్క్‌ని అందరూ గుర్తించాలని.. దాని గురించే మాట్లాడుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నందున విషయం ఏదైనా ప్రతి ఒక్కరూ మనల్ని వేలెత్తి చూపించేందుకు చూస్తారు. గట్టిగా నవ్వితే తప్పంటారు. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతే పొగరంటారు. కాబట్టి అభిప్రాయాలనేవి ఎప్పటికీ ఒకేలా ఉండవు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే' అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments