Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్‌ ఎక్కడైనా స్నానం చేసేయగలదు.. అర్జున్ కపూర్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (13:17 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జాన్వీకి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఎలాంటి ఫోటో ఇన్ స్టాలో అప్ లోడ్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా జాన్వీ స్టెప్ బ్రదర్ అర్జున్ కపూర్-జాన్వీ కపూర్ మధ్య చాటింగ్ అంతే స్పీడ్‌గా వైరల్ అయింది. ఆ విషయంలోకి వెళ్లే ముందు జాన్వీ గురించి మరికొన్ని వ్యక్తిగత విషయాలు చర్చించాలి.
 
జాన్వీ దేశీయంగా పర్యటనలు చేసినా.. విదేశాలు వెళ్లినా వెనుక భారీగా లగేజ్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ మినహా రెండు..మూడు సూటుకేసులు...రెండు బ్యాగులు వెంట తప్పక ఉండాల్సిందే. టూర్ ఎన్ని రోజులైనా కామన్ గా అంత భారీ లగేజీ కనిపిస్తుంటుంది. అందులో జాన్వీకి సంబంధించిన పర్సనల్ థింగ్స్ తో పాటు ఇంకా తనకు అవసరమైనవన్నీ ఉంటాయి. అయితే అర్జున్ కపూర్ చెల్లి గురించి ఓ పోస్ట్ పెట్టాడు. "జాన్వీ ఎక్కడికి వెళ్లినా సూటు కేసు.. షవర్లతో తిరుగుతుంటుంది. జాన్వీ ఎలాంటి ప్రదేశంలోనైనా స్నానం చేయగలదు. ఇదేం విచిత్రమో"అంటూ జాన్వీని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.
 
దీనికి బదులుగా జాన్వీ.. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? నేను అక్కడ కూడా స్నానం చేస్తానని ఫన్నీగా స్పందించింది. అంటే జాన్వీ లగేజీలో ఎక్కడైనా స్నాయం చేసేందుకు వీలుగా ఉండే ఓ కిట్‌ని కూడా ఏర్పాటు చేసుకుంటుందని తెలుస్తోంది. 
 
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే దోస్తానా-2 లో నటిస్తోంది. అలాగే `కార్గిల్ గర్ల్ -గుంజన్ సక్సేనా`కు దర్శకత్వం వహించిన శరణ్ శర్మ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. ఇందులో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments