Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్ స్టూడియో నిర్మాణంలో జంధ్యాల గారి జాతర 2.0

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (16:31 IST)
Krish Siddipalli, Kashvi, Pridvi, Yani Master
సన్ స్టూడియో బ్యానర్ పై, శ్రీనిధి క్రియేషన్స్ సమర్పణలో నిర్మిస్తున్న తాజా చిత్రం 'జంధ్యాల గారి జాతర 2.0' ఈరోజు అతిరథమహారధులు మధ్య విజయవంతంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. థర్టీ ఇయర్స్ పృద్వి హీరో హీరోయిన్ ల నడుమ మొదటి సీన్ కు యాక్షన్ చెప్పారు. 
 
ఈ సందర్భంగా కమెడియన్ పృద్వి మాట్లాడుతూ.. ఈరోజు మంచిరోజని, సినిమా టైటిల్ చూడగానే చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. ఫుల్ లెన్త్ కామెడీ చిత్రాంగా తెలుగు పరిశ్రమలో ఒక ముద్ర వేసుకుంటుంది అని చెప్పారు. హీరో క్రిష్, హీరోయిన్ కష్వీలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన కూతురు శ్రీలు కూడా ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ వాల్మీకి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు.
 
పూర్తి హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాల్మీకి తెలిపారు. ఈ సినిమాకు జంధ్యాల గారి పేరు పెట్టడంతో ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడుతాయని, అయితే ఈ సినిమా కచ్చితంగా అందరి అంచనాలను ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జంధ్యాల గారి జాతర చిత్రం విడుదల తర్వాత కచ్చితంగా ప్రేక్షకులకు హాస్య జాతర పరిచయం అవుతుందని చిత్ర దర్శకుడు వాల్మీకి వెల్లడించారు.
 
ఈ సందర్భంగా హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. సినిమా ఆధ్యాంతం హాస్య భరితంగా ఉంటుందని, ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా అని పేర్కొన్నారు.
 
నటుడు రఘుబాబు మాట్లాడుతూ ఉత్సాహమైన మేకర్స్ తో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చిత్రం టైటిల్ చాలా బాగుందని సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తుందని తెలిపారు. సినిమాలో తనతో పాటు టాప్ కమెడియన్స్ అందరూ నటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే చిత్ర దర్శకనిర్మాతలకు రఘుబాబు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో క్రిష్ సిద్దిపల్లి, హీరోయిన్ కష్వీ, కమెడియన్ పృద్వి, నటుడు రఘుబాబు, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
 
నటీనటులు: క్రిష్ సిద్ధిపల్లి, కాష్వీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సత్య, పృద్వి, అజయ్ గోష్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ప్రిన్స్, నాగినీడు, పవిత్ర నరేష్, పూర్ణ, సురేఖ వాణి, దువ్వాసి మోహన్, శ్రీలు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments