Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్... పాన్ ఇండియా మూవీగా తీస్తా (video)

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (20:17 IST)
డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ క‌చ్చితంగా 'జ‌న‌గ‌ణ‌మ‌న' మూవీని తీస్తాన‌ని చెప్పారు. "జ‌న‌గ‌ణ‌మ‌న అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌. అతి త్వ‌ర‌లో దాన్ని తియ్య‌డానికి ప్లాన్ చేస్తున్నా" అని ఆయన చేసిన ప్ర‌క‌ట‌న‌ను పూరి క‌నెక్ట్స్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 
 
ఎంతో కాలంగా 'జ‌న‌గ‌ణ‌మ‌న' చిత్రాన్ని తీయాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ అనుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఇంత‌వ‌ర‌కూ అది వాస్త‌వ రూపం దాల్చ‌క‌పోవ‌డంతో, ఆ సినిమాని ఇక పూరి తీయ‌రేమో అనే సందేహాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్నాయి.

వీటికి తాజా ప్ర‌క‌ట‌న‌తో పూరి జ‌గ‌న్నాథ్ చెక్ చెప్పారు. 'జ‌న‌గ‌ణ‌మ‌న' పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతుంద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో పూరి ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమా టోట‌ల్‌ స్క్రిప్టును లాక్‌డౌన్ టైమ్‌లో ఆయ‌న‌ పూర్తి చేశారు. స్క్రిప్టు అద్భుతంగా వ‌చ్చింద‌ని స‌మాచారం.
 
'జ‌న‌గ‌ణ‌మ‌న' మూవీని ఏ హీరోతో పూరి చేస్తారో త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్న‌ది. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా త‌ను రూపొందిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఫైట‌ర్' త‌న కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంద‌ని పూరి జ‌గ‌న్నాథ్ చెప్పారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోంది.
 
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments