Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సునీల్ 'జక్కన్న'

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (17:09 IST)
సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్‌గా, 'ప్రేమ‌క‌థా చిత్ర‌మ్' త‌ర్వాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న'. ప్రస్తుతం ఈ చిత్రం రామెజిఫిల్మ్ సిటిలో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో వుంది. మ‌రో రెండు రోజుల్లో షూటింగ్ పార్ట్ అంతా పూర్త‌వుతుంది.
 
ఇప్ప‌టికే పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఆడియోని మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా విడుద‌ల చేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చూస్తే సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేలా ఉంది. ఇదే విషయాన్ని సోష‌ల్ మీడియాలో వివ‌రీతంగా ట్రెండింగ్ చేశారు. 
 
పంచ్ డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ర‌క్ష చిత్రం ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. దినేష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై 22వ తేదీన విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సునీల్ నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మా 'జ‌క్క‌న్న' చిత్రం. సునీల్ కామెడీ టైమింగ్‌కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్‌కి థియేట‌ర్స్‌లో క్లాప్స్ ప‌డ‌తాయి. దీనికి ఉదాహ‌ర‌ణ రీసెంట్‌గా రిలీజ‌ైన థియోట్రిక‌ల్ ట్రైల‌ర్. అదేవిధంగా దినేష్ అందిచిన ఆడియో కూడా ఫుల్‌ఎన‌ర్జిగా ఉంటాయి. అన్ని పాట‌లు పాడుకునేలా ఉంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ కొత్త‌ పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. 
 
'ప్రేమకథా చిత్రం' తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎట్టిప‌రిస్థితిలో మా చిత్రాన్ని జులై 22న‌ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలో సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించారు. 
 
సాంకేతిక వర్గంలో బ్యానర్ - ఆర్ పి ఏ క్రియేషన్స్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్ - మురళి, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, స్టిల్స్ - వాసు, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments