రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్టు 10వ తేదీన విడుదలకానుంది. తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం జోరు పెంచింది.
రెండు రోజుల కిందట చెన్నైలో సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 'నువ్వు కావాలయ్యా, హుకుం' పాటలు ట్రెండింగులో ఉన్నాయి. హుకుం పాట తెలుగు వెర్షన్‌ను విక్టరీ వెంకటేశ్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
'ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్‌ను నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది గప్ చుప్‌గా ఫాలో అవ్వాలి' అంటూ రజనీకాంత్ డైలాగ్స్ పాట మొదలైంది. 'హుకుం.. టైగర్ కా హుకుం.. ఉరుముకు, మెరుపుకి పుట్టాడురా.. తరతరతరముల సూపర్ స్టార్ రా..' అంటూ రజనీ మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకొని భాస్కర బట్ల పాట రాశారు.