Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగపతి బాబు పాదయాత్ర... రాజకీయ అరంగేట్రం చేస్తారా?

లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబుకు నంది అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. నంది అవార్టులపై వస్తున్న విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ''అది మీ ప్రాబ్లమ్ కానీ మా ప్రాబ్లమ్ కాదు'' అంటూ జ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (11:08 IST)
లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబుకు నంది అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. నంది అవార్టులపై వస్తున్న విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ''అది మీ ప్రాబ్లమ్ కానీ మా ప్రాబ్లమ్ కాదు'' అంటూ జగపతిబాబు దాటేశాడు. లెజెండ్ సినిమాలో విలన్‌గా చేశాను. తాను నటించిన మొదటి చిత్రం సింహస్వప్నం సినిమా మూడు రోజలు ఆడింది. లెజెండ్ మూడు సంవత్సరాలు ఆడింది. నంది అవార్డ్ కూడా వచ్చింది. సంతోషంగా ఉందని జగపతిబాబు చెప్పారు. 
 
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో ''లెజెండ్'' సినిమాకుగానూ ఉత్త‌మ విల‌న్‌గా జ‌గ‌ప‌తి బాబు ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా త‌న‌కు అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల జ‌గ‌ప‌తి బాబు హర్షం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ ప్రాంతంలో సోమవారం సిని నటుడు జగపతి బాబు అభిమానులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు అంతరించిపోకుండా విజయాలు సాధించాలని, చిత్ర పరిశ్రమకు కొత్తగా వస్తున్న కథానాయకులను, నాయికలను ప్రోత్సహించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. 
 
చిన్న సినిమాలకు థియేటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్య ఎక్కువగా ఉందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగపతి బాబు ’హలో’, రంగస్థలం 198’, ‘సైరా నరసింహారెడ్డి’, ’జై సింహా’ తదితర చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే జగపతిబాబు రాజకీయ అరంగ్రేటం కోసమే పంచెకట్టులో జగపతిబాబు ఇలా పాదయాత్ర చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments