Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క కూతురుని పెళ్లి చేసుకోమన్నారు.. వద్దన్నా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు : 'జబర్దస్త్' వినోద్

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు, అందులో గాయపడినట్టు వచ్చిన వార్తలపై 'జబర్దస్త్' వినోద్ అలియాస్ వినోదిని స్పందించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ కారణంగా తన తల్లిదండ్రులు ఈనెల 8వ తేదీన కడపలోని ఓ చర్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (15:00 IST)
తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు, అందులో గాయపడినట్టు వచ్చిన వార్తలపై 'జబర్దస్త్' వినోద్ అలియాస్ వినోదిని స్పందించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ కారణంగా తన తల్లిదండ్రులు ఈనెల 8వ తేదీన కడపలోని ఓ చర్చికి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో తన అక్క కుమార్తె కూడా అక్కడకు రాగా పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులంతా ప్రతిపాదన చేశారని చెప్పారు. ఈ పెళ్లిని సున్నితంగా తిరస్కరించానని చెప్పాడు. 
 
అక్కడ జరిగింది ఇదైతే... తనను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని, ఆత్మహత్యాయత్నం చేశానని, తన చేతులకు గాయాలయ్యాయని.. ఇలా ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. మరో ఐదేళ్ల వరకు అలాంటి ప్రతిపాదన వద్దని స్పష్టం చేశానని, ఆఫర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తాను తొందరపడి పెళ్లి చేసుకోలేనని చెప్పానని తెలిపాడు.
 
తనకు సోషల్ మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, దాన్ని పోగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే... తొలిసారి తాను లేడీ గెటప్ వేసినప్పుడు 'అబ్బ.. భలే మేకప్ చేశారే...' అనిపించిందని చెప్పాడు. వినోదినిగా పాప్యులర్ కావడంతో అలాంటి లేడీ గెటప్ అవకాశాలే వస్తున్నాయని తెలిపాడు. వినోదినిగా భ్రమించి చాలా మంది ప్రపోజల్స్ చేశారని, చాలా మంది గిఫ్టులు కూడా పంపుతుంటారని వినోద్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments