Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నైట్ మాత్రమే వెలుగునిస్తా, జబర్దస్త్ డబుల్ మీనింగ్, ఆపిల్ కొరికాడన్న రోజా

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (20:28 IST)
జబర్దస్త్ షోలో సింహభాగం డబుల్ మీనింగులతో కొట్టుకుని పోతూ వుంటుంది. యాంకర్లు, జడ్జిలు పకపకా పడీపడీ నవ్వుతుంటారు. ఈ షో ప్రొమోలు తీసి యూ ట్యూబులో పెట్టారంటే వాటికి మిలియన్ల సంఖ్యలో వ్యూస్. ఇంకేముంది ఆర్టిస్టులు తమ డైలాగులకు పదును పెడుతూ వుంటారు.
 
మామూలు డైలాగులయితే ఎవ్వరూ పట్టించుకోరు కదా.. అందుకే కాస్త మసాలా దట్టించి డబుల్ మీనింగ్ డైలాగులతో వదులుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే... వచ్చే జబర్దస్త్ షోకి సంబంధించి ప్రోమోను వదిలారు. అందులో డైలాగులు మామూలుగా లేవు.
 
''లేటుగా ఇంటికి వచ్చిన భర్తని ఎందుకు లేట్ అయ్యింది'' అని అడుగుతుంది హరిత, దాంతో ''దారిలో వస్తుంటే దురదకుండ ఆకు తగిలిందే, నలుగురు గోకితే కానీ నాకు దురద తగ్గలేదు'' అని వెంకీ అన్నాడు. అందుకు హరిత, ''ఆ దురదగుంట ఆకు నాకు తగిలినా బాగుండు'' అని పంచ్ వేయగానే హరీ అంటూ అనసూయ పడీపడీ నవ్వింది.
 
మరో డైలాగ్... ''నేను సూర్యుడి లాంటోండిని పగలు అందరికీ వెలుగునిస్తా'' అని వెంకీ అంటాడు. అందుకు హరిత అందుకుని, ''నేను స్ట్రీట్ లైట్ లాంటి దాన్ని, నైట్ మాత్రమే వెలుగునిస్తా'' అంటూ డబుల్ మీనింగ్ పంచ్ కొట్టింది. ఈ పంచ్ దెబ్బకి జడ్జీ రోజా పెద్దగా నవ్వుతూ తలను బాదుకుంది. అంతేకాదు.. మరో డైలాగులో తాగుబోతు రమేష్, సాయి ఇద్దరూ కలసి ఒకే యాపిల్‌ తింటూ చేసిన సరసాలపై పంచ్ కొడుతూ... అందుకే ఆపిల్ కొరికాడు అని అంది. మొత్తానికి అలా విడుదలైన ప్రమో ఇలా వేలలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

సంబంధిత వార్తలు

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments