Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గెటప్ వద్దన్నారు.. చేతులు పట్టి లాగేవారు.. ఏడాదిలోపు పెళ్లి.. వినోదిని

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:01 IST)
జబర్దస్త్ వినోదిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అబ్బాయైనప్పటికీ లేడి గెటప్‌ల్లో అదరగొడుతాడు. చమ్మక్ చంద్రతో వినోద్ (వినోదిని) స్కిట్స్‌కు మంచి క్రేజ్ వుంది. అమ్మాయి గెటప్‌లో వినోదిని చేసే డ్యాన్సులు, హావభావాలకు చప్పట్లు కొట్టాల్సిందే. అలాంటి వినోదిని తాను అబ్బాయిగా పుట్టినా లేడీ గెటప్స్ వేయడం ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 
 
ఇతరులు చెప్పే మాటలు విని తల్లిదండ్రులు అమ్మాయి క్యారెక్టర్స్, గెటప్స్ చేయొద్దన్నారని.. కానీ తాను మాత్రం ఇతరుల మాటలను పెద్దగా పట్టించుకోనని తనకు నచ్చిన విషయాన్ని చేసుకుపోతానని.. అయితే తనకు సన్నిహితులు ఎవరైనా చిన్న మాటంటే మాత్రం బాధపడతానని వినోద్ చెప్పుకొచ్చాడు. ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు.

ఈ ఏడాదిలోపు వివాహం అయిపోయిందని వినోద్ తెలిపాడు. ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని త్వరలో వివాహం జరుగుతుందని వినోదిని చెప్పాడు. తాను అమ్మాయిగా మారిపోతున్నానని.. అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆ వార్తలను పెద్దగా పట్టించుకోనని వినోద్ వెల్లడించాడు. 
 
యాంకర్ అవ్వాలని యాక్టర్ అయ్యానని తెలిపాడు. ఆర్టిస్టుగా హ్యాపీగా వున్నానని.. లేడి గెటప్‌లపై కొన్ని పొగడ్తలు వచ్చినా.. కొన్ని సమస్యలు కూడా వచ్చాయని.. పబ్లిక్‌లోకి వెళ్తే.. సెల్ఫీల కోసం ఎగబడేవారు ఎక్కువని వినోద్ చెప్పాడు. అలా చేతులు పట్టి లాగి ఫోటోలకు ఫోజులివ్వాలని అభిమానులు పోటీపడేవారని.. అలా తన చేతికి ఓసారి గాయమయ్యింది.. వేసుకున్న దుస్తులు కూడా చినిగిపోయేవని వినోద్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments