Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సెలెక్ట్ చేసిన చీరనే ఇవాంకా కట్టుకోనుందా?

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత సెలెక్ట్ చేసిన చీరల్లోనే ఓ చీరను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తెను అందించనున్నారు. ఇవాంకాకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర కూడా వుంది.

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (09:24 IST)
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత సెలెక్ట్ చేసిన చీరల్లోనే ఓ చీరను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తెను అందించనున్నారు. ఇవాంకాకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర కూడా వుంది. సిద్ధిపేటలో ఈ చీరల తయారీ జరుగుతోంది. చేనేత  దుస్తులను తెలంగాణ సర్కారు ప్రోత్సహిస్తోంది. 
 
ఇందుకోసం సినీనటి.. అక్కినేని నాగార్జున కోడలు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చీఫ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్ రాకను పురస్కరించుకుని.. హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు సిద్ధిపేట నుంచి గొల్లచీర కానుక కూడా సిద్ధమైంది. ఇవాంక కోసం సమంతనే కొన్ని చీరల డిజైన్లను సెలెక్ట్ చేసింది. సమంత సెలెక్ట్ చేసిన డిజైన్ల నుంచే ఇవాంకకు కానుకగా ఇచ్చే చీరను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. ఇవాంకా రాక కోసం భాగ్యనగరం ఎదురుచూస్తోంది. ఆమె రాకను పురస్కరించుకుని మాదాపూర్‌, మరికొన్ని ప్రాంతాలు అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నాయి. చార్మినార్‌ వద్ద ఏకంగా ఓ మాల్‌నే ఏర్పాటు చేశారు. రోడ్లపై బిచ్చగాళ్లను చూసి ఏమనుకుంటుందో అనే అనుమానంతో కనిపించిన ప్రతి బిచ్చగాడినీ జైలుకు పంపించారు.
 
మరోవైపు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కోసం అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భద్రత కోసం ఎక్కువే ఖర్చుపెడుతోంది. ఇవాంకా వెంట ఆమె భర్త, అమెరికా ప్రభుత్వంలో మరో సలహాదారు అయిన జెరేడ్ కుష్నర్‌ కూడా వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments