Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ త‌రుణ్‌కు తొలిసినిమాలా వుంది - వ‌రుణ్ తేజ్‌

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (08:51 IST)
Standup Rahul pre release
రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద స‌మ‌ర్ప‌కులు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని హోలీ కానుక‌గా ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. క‌న్‌వెన్‌ష‌న్‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్యతిథిగా విచ్చేసిన వ‌రుణ్‌తేజ్‌, ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడితో క‌లిసి బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. 
 
అనంత‌రం వ‌రుణ్ తేజ్ తెలుపుతూ, సిద్దు ఈ క‌థ‌ను శాంటో ద్వారా నాకూ వినిపించారు. ద‌ర్శ‌కుడిలో చాలా క్లారిటీ వుంది. ట్రైల‌ర్‌లో ఆ విష‌యాన్ని చ‌క్క‌గా చెప్పాడు. నేను, రాజ్ త‌రుణ్ ఒకేసారి కెరీర్‌ను మొద‌లు పెట్టాం. ఇప్ప‌టికీ అలానేవున్నాడు. త‌ను మంచి న‌టుడు. త‌న తొలి సినిమాలా వుంది స్టాండప్ రాహుల్. త‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కుతుంది. వ‌ర్ష మిడిల్‌క్లాస్ మెలోడీస్ చూశాను. త‌న‌కు భ‌విష్య‌త్ వుంది. ఇంద్ర‌జ చ‌క్క‌గా న‌టించారు. కెమెరా విజువ‌ల్స్‌, సంగీతం బాగా ఆక‌ట్టుకున్నాయి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. 
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, స్టాండప్ కామెడీ ద్వారా న‌వ్వించ‌డం క‌ష్టం. ఇందులో కామెడీనేకాదు చాలా అంశాలున్నాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఉయ్యాల‌జంపాల టైంలో వున్న‌ట్లుగా రాజ్‌త‌రుణ్ వున్నాడు. ఇంద్ర‌జ‌గారి సినిమాలు చూశాను. త‌ను మంచి న‌టి. ద‌ర్శ‌కుడు శాంటోకి ఆల్ ది బెస్ట్‌. ట్రైల‌ర్‌లోనే ఏది వుండ‌బోతుందో క్లారిటీగా చెప్పేశాడు. శ్రీ‌క‌ర్ సంగీతం బాగుంది. అంద‌రి కృషికి ఫ‌లితం ద‌క్కుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది. ఈ స్టేజీమీద కొంద‌రు స్టాండప్ కామెడీ చేశారు. ఇది చూస్తుంటే నా కాలేజీలో ఓసారి ర‌ఘుబాబుగారు చేసిన జోక్ గుర్తుకువ‌స్తుంది. దాన్ని నేను కాలేజీలో స్కిట్‌గా చేశాను. అదే నాలో ద‌ర్శ‌కుడు వున్నాడ‌నే గుర్తుండేలా చేసిందంటూ.. బ‌స్‌లో ఓ ప్ర‌యాణీకుడు సీటులో కూర్చోకుండా అటూ ఇటూ న‌డుస్తూ ఎలా గ‌మ్యానికి చేరాడ‌నేది చెప్పి అంద‌రినీ న‌వ్వించారు.
 
రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ, నాకు ఎప్ప‌టికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగ‌స్త్య రెండేళ్ళు ఈ సినిమాకే ప‌నిచేశాడు. ఇంద్ర‌జ‌, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిశోర్ మొద‌లైన‌వారితో ప‌నిచేయ‌డం గొప్ప‌గా వుంది. ఇందులో నేను బాగా న‌టించానంటే కార‌ణం వ‌ర్ష‌. ద‌ర్శ‌కుడు శాంటోతో ప‌నిచేయ‌డం హ్యాపీగా వుంది. సినిమా మాకు న‌చ్చింది. మీకూ న‌చ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రామ్‌కామ్ సినిమా ఇద‌ని` తెలిపారు.
 
శాంటో మాట్లాడుతూ, మా ఫ్యామిలీకి సినిమారంగంతో అనుభంలేదు. వారు ఇప్పుడు న‌న్ను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇది కామెడీ ఫిలిం అని చేయ‌లేదు. మ‌నం దేన్నైనా స‌రే ఇష్ట‌ప‌డితే ఎవ‌రినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిల‌బ‌డాలి, పోరాటం చేయాల‌ని చెప్పే క‌థ ఈ సినిమా. అందుకే స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యాన్ని ఎంచుకున్నా. రాజ్ త‌రుణ్ బాగా స‌హ‌క‌రించారు. నేను అంత‌కుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. క‌రోనావ‌ల్ల ఇంకా బాగా రాయ‌డానికి స‌మ‌యం కుదిరింది. వ‌ర్ష మంచి న‌టి. ఈ సినిమాలో చాలా జోక్స్ వ‌ర్ష చెప్పిన‌వే. శ్రీ‌రాజ్ విజువ‌ల్స్ బాగా చూపించాడు. ఇంద్ర‌జ‌తోపాటు అంద‌రూ బాగా న‌టించార‌ని అన్నారు.
 
`మార్చి 18న  థియేట‌ర్‌కు వ‌చ్చి ఎంజాయ్ చేయండని` నిర్మాత భ‌ర‌త్ పేర్కొన్నారు. `రాజ్ త‌రుణ్ చూపించే విధానం కొత్త‌గా వుంటుంది. శాంటో క్లారిటీగా ఈ సినిమా చెప్పాడు. రేపు అంద‌రూ థియేట‌ర్ల‌లో చూసి ఆనందించండి` అని మ‌రో నిర్మాత నంద కుమార్ అబ్బినేని అన్నారు. 
స‌మ‌ర్ప‌కుడు సిద్దు తెలుపుతూ, ఈ క‌థ విన‌గానే న‌చ్చి భ‌ర‌త్‌, నందుకు హెల్ప్ చేసేలా చేయ‌గ‌లిగానన్నారు. 
 
వ‌ర్ష బొల్ల‌మ్మ తెలుపుతూ, 96లో విజ‌య్‌సేతుప‌తితో ఓ సినిమా చేశాను. ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా ఇస్తే వారే మ‌న‌ల్ని త‌మ‌వారిగా చేసుకుంటార‌నే కొన్ని విష‌యాలు ఆయ‌న్నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమాలో బాగా న‌టించానంటే అందుకు కార‌ణం రాజ్ త‌రుణ్ స‌హ‌కార‌మే. ద‌ర్శ‌కుడు శాంటోకి క‌థ‌పై పూర్తి అవ‌గాహ‌న వుంది. ముఖ్య అతిథి వ‌రుణ్ తేజ్‌నుద్దేశించి..`గ‌ని` చూడ్డానికి మీ మ‌నీ పెట్టుకుని సిద్ధంగా వుండంటూ. ఉత్సాహ‌ప‌రిచారు. 
 
భీమ్లా నాయ‌క్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర మాట్లాడుతూ, శాంటో నాకు స్నేహితుడు. అరేబియ‌న్ కాన్సెప్ట్ మీద సినిమా చేయాలంటే బాగా తెలిసివుండాలి. శాంటో దాన్ని బాగా తీశాడ‌నిపిస్తుంది. ట్రైల‌ర్‌లో చూస్తుంటే రాజ్‌త‌రుణ్ పాత్ర బాగా చేసిన‌ట్లుగా వుంది అన్నారు.
 
`గ‌ని` ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెలుపుతూ, నిన్న‌నే ఈ సినిమా చూశాను. బాగా వ‌చ్చింది. నిర్మాత‌లు మంచి సినిమా తీశారు. రాజ్ త‌రుణ్ టైమింగ్‌, స్ట‌యిల్ చాలా బాగుంది. ఇంద్ర‌జగారికి మంచి రీఎంట్రీ అవుతుంద‌ని ఆశిస్తున్నాన్నా. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
  
ఇంకా సంగీత ద‌ర్శ‌కుడు  శ్రీ‌క‌ర్ అగ‌స్తీ, కెమెరామెన్ శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్, కొరియోగ్రాఫ‌ర్  ఈశ్వ‌ర్ మాట్లాడుతూ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. అలాగే స్టాండ‌ప్ కామెడీ పెర్‌ఫార్మ‌ర్స్‌, రైట‌ర్స్ అయిన రాజ‌శేఖ‌ర్‌,  హృద‌య్‌ రంజ‌న్‌, సందేశ్ త‌మ స్టాండ‌ప్ కామెడీని ప్ర‌ద‌ర్శించారు. అనంత్ శ్రీ‌రామ్ రాసిన  `అలా ఇలా` పాటను గాయ‌ని స‌త్య యామిని పాడి అల‌రించారు. రోల్ రైడా, గీత ర‌చ‌యిత ర‌ఘురామ్ కూడా మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments