బాహుబలి 2లో ప్రభాస్ వాటా చాలా తక్కువేనట.. ఎందుకనీ..?
ఎస్ఎస్ రాజమౌళి తీసిన అతి బారీ చిత్రం బాహుబలి-2 ది కంక్లూజన్ ఆదాయం శిఖరస్థాయికి చేరుకుంది. అలాంటి ఎపిక్ డ్రామా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ఎవరైనా సినిమా తీస్తే దానిపై వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలోనే ఉంటుంది కదా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాుహుబలి2 దాదాపు
ఎస్ఎస్ రాజమౌళి తీసిన అతి బారీ చిత్రం బాహుబలి-2 ది కంక్లూజన్ ఆదాయం శిఖరస్థాయికి చేరుకుంది. అలాంటి ఎపిక్ డ్రామా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ఎవరైనా సినిమా తీస్తే దానిపై వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలోనే ఉంటుంది కదా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాుహుబలి2 దాదాపు రూ. 1400 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉందని అంచనా. భారతీయ సినిమా చరిత్రలో దీనికంటే మించిన బెంచ్ మార్క్ ప్రస్తుతానికయితే లేదు. ఈ సినిమా కలెక్షన్లను బీట్ చేయాలంటే మరో పదేళ్లు పడుతుందని నిపుణుల అంచనా.
ప్రపంచం నివ్వెరపోయే వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలి2 సినిమాలో భాగమైన స్టార్లకు ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని షాక్‌కు గురి చేయవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నటించి తన రేంజిని ఎక్కడికో తీసుకెళ్లిన కథానాయకుడు ప్రభాస్‌కి తక్కువ రెమ్యునరేషన్ దక్కిందంటే నిజంగా షాకే మరి. బాలీవుడ్‌లో అయితే మొత్తం చిత్రం బడ్జెట్‌లో అధికభాగం నటులకు వెళుతుంది. పైగా ఆర్జించిన లాభాల్లోనూ వారికి వాటా లభిస్తుంది. కాని దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఖర్చు, నటుల ఫీజులు నిష్పత్తికి అనుగుణంగా లాభాలు అందుతాయి.
ఇప్పుడు విషయానికి వద్దాం. బాహుబలి2 ఇప్పటికీ వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తోంది కాబట్టి దర్శకుడు రాజమౌళికి దర్శకత్వం వహించినందుకు గాను 28 కోట్లు ముట్టగా మొత్తం లాభాల్లో మూడింట ఒకవంతు కూడా తనకే అందనున్నాయి. మరో రెండు మూడు వారాల పాటు బాహుబలి2 ఇదేరకంగా ప్రభంజనం సృష్టించనుంది కాబట్టి రాజమౌళికి లాభాల్లో వాటాగా ఎంత వస్తుందో ఊహించడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హీరో కంటే ఎక్కువగా దర్శకుడికి రెమ్యునరేషన్, లాబాల్లో అధిక వాటా సాధిస్తున్న చరిత్ర రాజమౌళికి మాత్రమే దక్కింది. ఉదా. కు అయిదువందల కోట్ల రూపాయల లాభం అంటే దాంట్లో మూడింట ఒక వంతు కింద 150 కోట్ల పైనే రాజమౌళి వాటా కిందికి వస్తుంది. ఈ లెక్కన బాహుబలి2 రన్ టైమ్‌లో రూ. 1500 కోట్లు సాధించిందంటే రాజమౌళికి దక్కే వాటా 450 కోట్లు. సినిమా విడుదలకు ముందే తయారీ ఖర్చులన్నీ టేబుల్ ప్రాఫిట్ కింద జమ అయ్యాయని చెప్పారు కాబట్టి రాజమౌళికి సినిమా సంపాదించే ప్రతి పైసాలోనూ వాటా ఉన్నట్లే లెక్క.