Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలంగా మాట్లాడే స్త్రీ పాత్ర చేయ‌డం గొప్ప‌గా వుంది: శృతిహాస‌న్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:57 IST)
Pitta kathalu, Shruti haasan, esha rebba
`పిట్ట కథలు`లో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎక్స్-లైఫ్ అనేది ప్రేక్షకులకి ఇంకా సాపేక్షంగా చెప్పదగిన కథ. షూటింగ్ ఒక మంచి అనుభవం. సంజిత్ హెగ్డేతో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే అతను ఈ ప్రాజెక్టుకు సరికొత్త శక్తిని మరియు ప్రతిభను తెచ్చాడు.

నేను దర్శకుడు నాగ్ అశ్విన్ విజ‌న్‌ని, అతను అల్లిన ఈ కథను చాలా ఇష్టపడుతున్నాను. సమాజం యొక్క ముందస్తు ఆలోచనలకు వ్యతిరేకంగా, బలంగా మాట్లాడే స్త్రీ పాత్రను పోషించడం గొప్ప‌ అనుభవం. ఈ కథ భవిష్యత్ ప్రపంచంలో సెట్ చేయబడినప్పటికీ, ఇది ఏదో ఒక రూపంలో నేటి ప్రపంచంలో కూడా కనిపిస్తుంది. ప్రేక్షకులు దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకోగలరని నేను నమ్ముతున్నాను`` శృతిహాస‌న్ అన్నారు.
 
నెట్‌ఫ్లిక్స్ మొదటి తెలుగు ఆంథాలజీ ఫిలిం `పిట్ట కథలు` - బోల్డ్ మహిళల జీవిత కథలను మీముందుకు తీసుకువస్తుంది. శుక్ర‌వారం 'పిట్ట‌క‌థ‌లు` ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేసింది. ఈ నాలుగు క‌థ‌ల స‌మాహారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి న‌లుగురు తెలుగు సినిమా అత్యుత్తమ ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంక‌ల్ప్‌ రెడ్డిలు దర్శకత్వం వహించారు.

సాధార‌ణంగా తెలుగులో చిన్న చిన్న క‌థ‌ల‌ను `పిట్ట‌క‌థ‌లు` అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల న‌లుగురు మ‌హిళ‌ల గురించి చెబుతుంది. ఈ  నాలుగు పాత్ర‌ల‌కు ప్రాణం పోయ‌డానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమ‌లా పాల్‌, శృతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. అలాగే అషిమా న‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌దేవ్‌, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.
 
ప్రేమ, కోరిక, వంచన మరియు శక్తి మ‌హిళా దృష్టి కోణంలో ఉంటూ వారికి ఏం కావాలో తెలియజేస్తుంది. రోనీ స్క్రూవాలా యొక్క RSVP మూవీస్ మరియు ఆశి దువా సారా యొక్క ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన `పిట్టకథలు` 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.
 
రాముల టైటిల్ రోల్ పోషిస్తున్నసాన్వే మేఘ‌న మాట్లాడుతూ , “స్త్రీ పురుషుల మధ్య ప‌వ‌ర్‌ డైనమిక్స్ అనేది `పిట్ట కథలు` యొక్క కేంద్ర ఇతివృత్తం. రాముల అనే సాదార‌ణ‌మైన అమ్మాయి అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. నేను త‌రుణ్ భాస్క‌ర్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌టినుండో ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రాముల‌ పాత్ర‌కి న‌న్ను సెల‌క్ట్ చేయ‌డం హ్యాపీగా ఉంది.`` అన్నారు.
 
మీరా పాత్ర‌ధారి అమ‌లాపాల్ మాట్లాడుతూ, ``పిట్ట కథలులోని ప్రతి కథ స్త్రీపురుషుల మధ్య మంచి చెడు సంబంధాలను అన్వేషిస్తుంది, ముఖ్యంగా పితృస్వామ్యం యొక్క వ్యక్తీకరణ దాని సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడానికి ఒక మ‌హిళ చేసే పోరాటం ఈ క‌థ‌. మీరా ఒక సాహసోపేత మహిళ పాత్ర‌. షార్ట్ ఫిల్మ్ ఫార్మాట్ కారణంగా ఈ స్టోరీ మరింత గ్రిప్పింగ్‌గా ఉంది. నాకు సరైన స్క్రిప్ట్. మీరా పాత్ర పట్ల నాకు బలమైన అనుబంధం ఉంది, ఎందుకంటే నేను ఇంతకు ముందు నేను న‌టించిన  ఆమె చిత్రానికి పూర్తిగా భిన్నంగా ఉండే ఒక ఛాలెంజింగ్ పాత్ర‌``అన్నారు.
 
పింకీ పాత్ర‌ధారి ఇషా రెబ్బ మాట్లాడుతూ, పింకీ అనే నా పాత్ర చాలా ధైర్యంగా కనిపిస్తుంది, ఆమె మ‌న‌సుకి నచ్చిన పని చేస్తుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడదు. ఆమె తన చుట్టూ ఉన్నవారి మధ్య కనపడే చిన్న చిన్న తేడాలు చూడటానికి చాలా చమత్కారంగా ఉంటాయి. ప్రేక్షకులు త‌ప్ప‌కుండా ఈ  కథతో కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఈ పాత్ర‌ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది`` అన్నారు. ‌పిట్ట‌క‌థ‌లు 19 ఫిబ్ర‌వ‌రి 2021 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండ‌నుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments