Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోలందరూ నేను పాటించే పద్ధతి పాటిస్తే బాగుంటుందంటున్న హీరో రాజ‌శేఖ‌ర్

Advertiesment
Operation Gold Fish
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (15:57 IST)
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రాజ‌శేఖ‌ర్ స్పందిస్తూ... కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే... “టైటిల్ బాగుంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు… యూత్ ఎట్రాక్ట్ అవుతారు. 
 
మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. పోలీస్ క్యారెక్టర్లు చేసే హీరోలందరూ ఈ వేదికపై ఉన్నారు. ఇటీవల అడవి శేష్ పోలీస్ క్యారెక్టర్ చేశారు. నేను చాలా పోలీస్ క్యారెక్టర్లు చేశా. సాయికుమార్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు‌. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. 
 
ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా‌. అబ్బూరి రవి గారు నటించడం కష్ట‌మన్నారు. కాదు… రాయడమే కష్టం. రైటర్స్‌కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే… ‘ఎవడైతే నాకేంటి’ ‌ కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. 
 
అప్పుడు రైటర్స్‌కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. సాయి కుమార్ గారు మైసూర్లో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన తరఫున నేను వచ్చాను. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ‌ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు. యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ఒక సినిమా చేశారు. నేను అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతూ ఉంటా… నాకు కథ నచ్చితే రెమ్యూనరేషన్ ఇవ్వొద్దు అని. 
 
కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులు వస్తే ఇవ్వమని చెప్తా. నమ్మకం ఉంటేనే సినిమా చేస్తాను కదా! నమ్మకం ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్నలా చూసి నా పేరెంట్స్ షాకయ్యారు: అవికా గోర్ ఇంటర్వ్యూ