అది పెంచుకునేందుకు ప్రకృతి వైద్యం కోసం వెళ్ళిన నయన్

మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:28 IST)
తెలుగు, తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతాఇంతా కాదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌‌గా చ‌క్రం తిప్పుతుంది. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

ఆరంభంలో కాస్త బొద్దుగానే కనిపిస్తూ గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార, ఆ తరువాత నాజూకుగా కనిపించడం కోసం బాగా సన్నబడింది. అయితే నయనతార సన్నబడటం వలన, ఆమె మునుపటిలా అందంగా కనిపించడం లేదనే అసంతృప్తిని చాలామంది అభిమానులు వ్యక్తం చేశారు.
 
నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎక్కువగా చేస్తూ రావడం వలన, ఆ తరహా సినిమాల్లో నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వలన గ్లామర్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల మళ్లీ గ్లామర్ ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చినప్పుడు, తనలో కాస్త గ్లామర్ తగ్గిందనే ఆలోచన నయనతారకి వచ్చిందట.

దాంతో గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న ఆకాంక్షతో ప్రకృతి వైద్యం కోసం ఆమె తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. కేరళలో ప్రత్యేక చికిత్స తరువాతే ఆమె షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బుల్లితెరే ఇష్టమంటున్న అవికా గోర్...