Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కాల్ చెయ్యండి చాలు.. వచ్చి వాలిపోతా అంటున్న కేరళ కుట్టి

దక్షిణాది సినిమాల్లో మలయాళ, కన్నడ భామల హవా తొలినుంచీ నడుస్తూనే ఉంది. కేరళనుంచి సినిమా అవకాశాల బాటలో అడుగుపెట్టి నిలదొక్కుకుంటున్న భామ ఐశ్వర్యా మీనన్. కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది.

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (04:43 IST)
దక్షిణాది సినిమాల్లో మలయాళ, కన్నడ భామల హవా తొలినుంచీ నడుస్తూనే ఉంది. కేరళనుంచి సినిమా అవకాశాల బాటలో అడుగుపెట్టి నిలదొక్కుకుంటున్న భామ ఐశ్వర్యా మీనన్.  కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది. రెండు మూడు తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈమె ఇప్పుడు వీర చిత్రంలో కథానాయికగా ఎలాగోలా చాన్సు దక్కించుకుని షూటింగ్ కూడా పూర్తి చేసింది.
 
తనకు చేతిలో ఏ అవకాశాలూ లేవు. అందుకనే కొందరు స్టార్ హీరోల జాబితా సంపాదించి వారికి గాలం వేసి అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని వార్తలు. అయితే ముందుగా ఆర్యమీదే గురి పెట్టిందీమె. ఎందుకంటే కాలేజీ డేస్ నుంచి ఆర్య అంటే తనకు వీరాభిమానం అట. అంతెందుకు నటి అన్న కోరిక తనలో కలిగిందుకు కారణం ఆర్యనే అనేసింది. 
 
అందుకే ఆర్యతో నటించే అవకాశం కలిగిస్తే ఫ్రీగా నటిస్తానని, పారితోషికం కూడా అడగనని ఫీలర్ వదిలింది ఈ భామ. తన లక్ష్యం సిద్ధింప జేసుకోవడానికి ఆర్యతో సినిమాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి ఒక్క చాన్స్ ఇవ్వరాదూ అంటూ రాయబారం పంపుతోందని సమాచారం. 
 
సినీ పరిశ్రమలో ఇలాంటి ఫ్రీ ఆపర్లు అంటే అవి ఎక్కడికి వెళతాయో తెలుసు కాబట్టి ఐశ్వర్య మీనన్ తన ప్రకటనలకు, వాస్తవానికి మధ్య తేడాను సరిగా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిదేమో..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments