Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (11:04 IST)
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో తాను నటించడం లేదని హీరో విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. గతంలో బుచ్చిబాబు - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించి, చిత్ర ఘన విజయంలో కీలక పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో సూరి, విజయ్ సేతుపతి, మంజు వారియర్ ప్రధాన పాత్రలుగా వెట్రిమారన దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై-2 చిత్రం ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఇందులో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, తాను రామ్ చరణ్ మూవీలో నటించట్లేదని స్పష్టం చేశారు. ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదన్నారు. పలు కథలు వింటున్నానని, ఏదైనా స్టోరీ బాగుంటే అందులోని హీరో క్యారెక్టర్ నచ్చడం లేదన్నారు. త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనంటూ గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు భాషా భేదం లేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments