Webdunia - Bharat's app for daily news and videos

Install App

''యాత్ర"లో జగన్‌గా విజయ్ దేవరకొండ-అర్జున్ రెడ్డి సినిమాలో మురుగదాస్

దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. ఈ చిత్రంలో వైఎస్సార్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:58 IST)
దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. ఈ చిత్రంలో వైఎస్సార్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. 


మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాత్ర కోసం సూర్య లేదా కార్తీ ఎంపికయ్యే అవకాశం వుందని టాక్ వస్తోంది.
 
అయితే తాజాగా ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో మంచి క్రేజున్న విజయ్ దేవరకొండను జగన్ పాత్రలో నటింపచేసేందుకు రంగం సిద్ధమవుతుందని టాక్ వస్తోంది. రాజకీయాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేస్తున్న తరుణంలో... జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది.
 
మరోవైపు విజయ్ దేవరకొండ సినిమా 'గీత గోవిందం' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఆయన తదుపరి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమాగా 'నోటా' రావడానికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సినిమాలో మురుగదాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో ఆనంద్ శంకర్ పనిచేశాడు. అందువలన తన గురువును తన సినిమాలో చూపెట్టేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments