Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ & కో లో తిక్కల్ ఫ్యామిలీ తో సుధాకర్ కోమాకుల అలరించేనా!

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (15:04 IST)
Sudhakar Komakula's tikkal fmaily
శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఏఎస్ బ్యూటిఫుల్,  ఆ తర్వాత  కుందనపు బొమ్మ వంటి సినిమాలు చేసిన సుధాకర్ కోమాకుల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ , సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఈరోజు ‘’నారాయణ & కో ‘ అని  టైటిల్ పెట్టి  ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 
 
ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. “'ఎక్స్ పీరియన్స్ ది తిక్కల్ ఫ్యామిలీ' అని పోస్టర్ పై వుండటం ఇంట్రస్టింగా వుంది. ఇది ఒక విలక్షణమైన కుటుంబం,  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అందరూ పగలబడినవ్వుతూ కనిపించారు. ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. నారాయణ & కో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.
 
జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బి  ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతోంది.  
 
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్  సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్.  శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments