Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

డీవీ
బుధవారం, 6 నవంబరు 2024 (17:06 IST)
Siva Reddy
కమేడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించి చిన్నతనంలోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న శివ శంకర్ రెడ్డి ఉరఫ్ శివారెడ్డి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఉద్వేగానికి గురయ్యారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించి సానా యాదిరెడ్డి సినిమాలో నటుడిగా మారిన శివారెడ్డి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగాడు. మరోవైపు విదేశాల్లో మిమిక్రీ ప్రోగ్రామ్ లు చేసుకుని జీవనం సాగించేవారు. అలాంటి శివారెడ్డి ఓసారి చెన్నైలో షూటింగ్ కి వెళ్ళి అభాసుపాలయ్యాడు. దానికి కారకుడు ఎవరనేది చూద్దాం.
 
నేను చెన్నైలో ఓ సినిమా షూటింగ్ కు వెళ్ళి మేకప్ కూడా పూర్తిచేసుకుని షాట్ రెడీ ఎప్పుడంటారా ఎదురుచూస్తున్నాను. సరిగ్గా ఆ టైంలో ఓ సీనియర్ కమేడియన్ వద్దన్నారని నన్ను వెంటనే తిరిగి పంపించేశారు. నేను షాక్ లో వుండి, వెంటనే ఏడుపు వచ్చేసింది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు కూడా చాలా బాధపడ్డారు. ఆయన వద్దంటే మేమేం చేయలేం అని వారు తెలియజేశారు. ఆ షాక్ లో ఎలా రైల్వే స్టేషన్ కు వెళ్లానో కూడా తెలీదు. ట్రెయిన్ లో నేను హైదరాబాద్ వచ్చేవరకు ఏడుస్తూనే వున్నా. ప్రయాణీకులు మా ఇంట్లో ఎవరైనా చనిపోయారేమోనని నన్ను పలుకరించారు. వారికి ఏమీ చెప్పలేక నా బాధను వ్యక్తం చేయలేక మానసిక వ్యధను అనుభవించాను.
 
అప్పుడు నాకు పెళ్ళయింది. పెండ్లి తర్వాత మొదటి షూటింగ్ అది. నేను నా భార్యకు ఎంతో  హ్యాపీగా షేర్ చేసుకుందామనుకున్న నేను నా బాధను షేర్ చేసుకోవాల్సివచ్చింది. నా భార్య కూడా బాధపడ్డా. సినిమా ఇండస్ట్రీలో మామూలే అనుకున్నా కానీ ఆ షాక్ నుంచి చాలా కాలం కోలుకోవడానికి పట్టింది.
 
నేను మిమిక్రీ ప్రోగ్రామ్ లు చేస్తుండగానే సినిమాలకోసం మహేంధ్ర అనే మేనేజర్ ను పెట్టుకున్నా. కానీ ఆయన కొన్ని నాకు తెలీకుండా పేమెంట్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు నాకు చాలా ఆశాభంగాన్ని కలిగించాయి. అది ఆయన తప్పుకూడా కాదు. నా ఫేట్. నేను విదేశాల్లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఓ ఫ్యామిలీ ఇంటిలో వున్నాను. వారు చాలా బాగా పరిచయం కానీ ఇండియా వచ్చి సినిమా తీస్తున్నారు. వారి ఆఫీస్ ఓపెనింగ్ కూడా వెళ్ళాను. కానీ షూటింగ్ టైంలో నన్ను పిలవలేదు. విషయం తెలిసి నిర్మాతను అడిగితే, అదేమిటి? మేనేజర్లకు చెప్పానే నిన్ను పిలమని అన్నారు. ఏమి జరిగిందో కానీ మేనేజర్లనుంచి ఓ ఫోన్ రాలేదు. అంటూ బాధను వ్యక్తం చేశారు.
 
అందుకే అప్పుడప్పుడు దేవుడిని కూడా తిడుతుంటాను. దేవుడా ఎందుకు ఇలా చేస్తున్నావ్. నేను పదిమందికి హెల్ప్ చేసే రకం. అని తెలిసి కూడా దేవుడు ఎందుకు అవకాశాలు ఇవ్వడంలేదని చాలాసార్లు ప్రశ్నించేవాడిని అంటూ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments