Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బాహుబలి-2 ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఓ ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో సంప్రదింపులు

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (04:56 IST)
భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన చిత్రం బాహుబలి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక విజువల్ వండర్‌గా నిలిచి రికార్డులను బద్దలు గొట్టిన ఆ చిత్రం రెండో భాగం కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతుండగా ఇప్పుడు మరొక ట్విస్ట్ వచ్చింది. 
 
కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బాహుబలి-2 ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఓ ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. 
 
2015లో విడుదలైన బాహుబలి-1 అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టింది. ఏప్రిల్ 28న బాహు‌బలి-2 విడుదల కానుండగా.. షారూఖ్ పాత్ర వార్తలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంకా ఏ విషయం ధృవీకరణ లేనప్పటికీ.. షారూఖ్ ఉంటే బాహుబలి-2కి అస్సెట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
 
అయితే బాహుబలి 2లో బాలీవుడ్ స్టార్ హీరోను నటింపజేయాలని భావించి ఉంటే రాజమౌళి ఇంత ఆలస్యంగా ఎందుకు పూనుకుంటున్నాడన్నది ప్రశ్న. హిందీ మార్కెట్‌ను మరింత కొల్లగొట్టాలని అనుకుంటే ఎంతో ముందుగా ప్లాన్ చేసుకుని ఉండేవారని, ఇంత అదరాబాదరాగా షారూక్‌ని రంగంలోకి దింపాల్సిన అవసరం ఏమిటని ఫిలిం క్రిటిక్స్ సందేహం. 
 
ఏదేమైనా ప్రచారం కోసం చేస్తున్న చీఫ్ ట్రిక్‌లో ఇది భాగమా లేక నిజంగానే షారుక్‌ని సినిమాలో ఏదో ఒక చోట ఇరికిస్తున్నారా అనేది రాజమౌళి స్వయంగా చెబితే కానీ తెలీదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments