Webdunia - Bharat's app for daily news and videos

Install App

యురేఖా సకామిఖా ఫార్మెట్ లో మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా వుందా?

డీవీ
గురువారం, 24 అక్టోబరు 2024 (18:26 IST)
Varun taj
వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 
జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యా దీనికి నిదర్శనం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెట్రో బీట్స్, పవర్ ఫుల్ కంపోజిషన్ తో వచ్చిన సెకండ్ సింగిల్ తస్సాదియ్యా ఇన్స్టంట్ హిట్ అలరించింది.
 
భాస్కరభట్ల రాసిన లిరిక్స్ వింటేజ్ టైమ్స్ లో లైఫ్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. మనో లైవ్లీ వోకల్స్ పదాలకు జీవం పోశాయి, రో విన్సెంట్ EL Fé కోయిర్‌ మరింత ఇంపాక్ట్ ని పెంచింది. అయితే ఈ సాంగ్ ఎత్తుకోవడమే చిరంజీవి నటించిన గత సినిమాలోని యురేఖా సఖామిఖా తరహాలో వున్నట్లు అనిపిస్తుంది.
 
వరుణ్ తేజ్ ఈ పాటలో ఎనర్జిటిక్ గా కనిపించారు, స్పాట్-ఆన్ స్టైలింగ్ తో అదరగొట్టారు. వరుణ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నులవిందుగా ఉన్నాయు. నోస్టాల్జియా అండ్ రిఫ్రెష్ వైబ్‌ తో పాట అదిరిపోయింది.  
 
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు.
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments