రష్మిక మందన్నాకు తేరుకోలేని షాకిచ్చిన కియారా అద్వానీ

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (10:52 IST)
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నాకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తేరుకోలేని షాకిచ్చింది. రష్మిక ఛాన్స్‌ను కియారా తన్నుకుపోయింది. నిజానికి రష్మికకు తన మాతృభాష కన్నడలో అంతగా పేరు లేదు. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ఆమెకు పంచి పేరు తెచ్చిపెట్టింది. 
 
తెలుగులో 'గీత గోవిందం' సంచలన విజయంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయింది రష్మిక. ఆ తర్వాత మల్టీస్టారర్‌ చిత్రం 'దేవదాస్'లో నానితో జత కట్టింది. ఆ చిత్రం ఓకే అనిపించింది. ఇక రెండోసారి విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం విడుదలకు ముందు పెద్ద హైప్‌ను క్రియేట్‌ చేసినప్పటికీ హిట్‌ రేంజ్‌కు చేరలేదన్నది ట్రేడ్‌ వర్గాల మాట. 
 
అయితే అంతకు ముందు ఉన్న క్రేజ్‌తో మహేశ్‌బాబుతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో కలిసి భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది. ఇకపోతే తమిళంలోనూ ‘గీత గోవిందం’ తెచ్చి పెట్టిన పాపులారిటీతోనే కార్తీతో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. 
 
కాగా అంతకు ముందే విజయ్‌ సరసన నటించే అవకాశం ఈ అమ్మడి కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.  దీంతో ఆగండయ్యా ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు అంటూ చిరు కోపంతో వారిని కట్డడి చేసింది.  దీంతో విజయ్‌కు జంటగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు రష్మిక మీడియాకు వెల్లడించింది. అలాంటిది విజయ్‌ 64వ చిత్రంలో నటి కియారా అద్వానీ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో హిట్స్‌ను అందుకుంటున్న కియారా ప్రస్తుతం బిజీగానే ఉంది.
 
దీంతో నటి రష్మిక విజయ్‌తో నటించే అవకాశం తనకే వస్తుందనే ఆశలు పెట్టుకుంది. అలాంటిది తాజాగా నటి కియారా తన కాల్‌షీట్స్‌ను సర్దుబాటు చేసుకుని విజయ్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రష్మిక ఆశ నిరాశగా మిగిలిపోయిందని బాధపడుతోందట. ప్రస్తుతం విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments