Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది సినిమాల గుప్పిట్లో భారత మూవీ మార్కెట్.. హిందీ సినిమా మారకపోతే ఇంతే సంగతులు

బాలీవుడ్ చిత్రపరిశ్రమ నిజంగానే వణికిపోతోంది. ఒక దక్షిణాది సినిమా, ఒక తెలుగు సినిమా దేశీయ మార్కెట్‌ను కొల్లగొట్టడమే కాదు ప్రపంచ స్థాయిలో రికార్డులను కూడా బద్దలు కొడుతున్న వైనం చూస్తూ ఏం చేయాలి అనే డైలమ్మాలోబాలీవుడ్ పడిపోయింది. అటు హాలీవుడ్ సినిమాలు ఇప

Webdunia
గురువారం, 18 మే 2017 (08:35 IST)
ఇప్పుడు చిత్రపరిశ్రమ నిజంగానే వణికిపోతోంది. ఒక దక్షిణాది సినిమా, ఒక తెలుగు సినిమా దేశీయ మార్కెట్‌ను కొల్లగొట్టడమే కాదు ప్రపంచ స్థాయిలో రికార్డులను కూడా బద్దలు కొడుతున్న వైనం చూస్తూ ఏం చేయాలి అనే డైలమ్మాలోబాలీవుడ్ పడిపోయింది. అటు హాలీవుడ్ సినిమాలు ఇప్పటికే హిందీ సినిమా వ్యాపారాన్ని తమవైపు మళ్లించుకుంటున్న సమయంలో ప్రాంతీయ సినిమా అయిన బాహుబలి-2 హిందీ ప్రాంతంలో కనీవీనీ ఎరుగని రికార్డును సొంతం చేసుకుంటూ ఉండటం బాలీవుడ్ ప్రముఖులను ఆలోచనలో పడవేసింది.
 
ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాటల్లో ఇదే బయటపడింది. బాహుబలి-2 నిజంగానే టాలీవుడ్ అందించిన విజువల్ వండర్ అని మెచ్చుకుంటూనే హిందీ సినిమా మారాల్సిన సమయం వచ్చిందని తేల్చి చెప్పేశాడు ఇర్పాన్. ‘‘బాహుబలి వంటి దక్షిణాది సినిమాలు భారత దేశంలోని మొత్తం మార్కెట్‌ను గుప్పెట్లోకి తెచ్చుకునేలా పుంజుకుంటున్నాయి. కాబట్టి హిందీ సినిమాలు మరింత మంచి సబ్జెక్టులతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
 
రెండు రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కూడా టెక్నాలజీని భారీ స్థాయిలో ఉపయోగించడమే బాహుబలి-2 అద్బుత విజయానికి కారణం అని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడి పెట్టగల దమ్ము లేకపోతే బాహుబలి-2 వంటి సినిమాల వైభవం రాదని చెప్పారు. మొత్తం మీద బాహుబలి-2 బాలీవుడ్ ప్రముఖులను ఆలోచింప చేస్తున్నట్లుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments